మహేశ్ గొప్ప నిర్ణయం మంచిదే .. కానీ ఫ్యాన్స్ నాట్ హ్యాపీ!!

Mahesh Babu

Mahesh Babuసూప‌ర్ స్టార్ మ‌హేష్ కెరీర్ 27వ సినిమా కోసం ఆచితూచి అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. స్క్రిప్టు ఎంపిక ద‌శ‌లోనే చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకున్నారు. సుకుమార్ స్క్రిప్టుతో మెప్పించ‌లేక‌పోవ‌డంతో అత‌డిని ప‌క్క‌న పెట్టి ప‌ర‌శురామ్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ప్ర‌తి సినిమా త‌న‌కు మొద‌టి సినిమా అన్నంత ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు మ‌హేష్‌.

2020 సంక్రాంతికి రిలీజైన `స‌రిలేరు నీకెవ్వ‌రు` మ‌హేష్ కి వంద శాతం సంతృప్తి నివ్వ‌లేదు. ఈ సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా స్పీడ్ చూపించినా కంటెంట్ ప‌రంగా క్రిటిక్స్ ని సంతృప్తిప‌ర‌చ‌లేక‌పోవ‌డం త‌న‌ని ఆలోచ‌న‌లో ప‌డేసింద‌ని చెబుతున్నారు. అందుకే ప‌ర‌శురామ్ తో సినిమా విష‌యంలోనూ ఎంతో జాగ్ర‌త్త తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే స‌ర్కార్ వారి పాట అంటూ టైటిల్ ని ప్ర‌క‌టించారు. మ‌హేష్ లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఇక సెట్స్ కెళ్ల‌డ‌మే ఆల‌స్యం అనుకుంటుండ‌గా.. కోవిడ్ మ‌హ‌మ్మారీ విరుచుకుప‌డింది.

ఇలానే వెయిట్ చేస్తే ఏడాదంతా ఇంతే. క‌నీసం 2021 ఆరంభంలో అయినా సెట్స్ కెళ్లాల్సి ఉంటుంది. అప్ప‌టికీ కోవిడ్ తగ్గుతుందా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. అందుకే మ‌హేష్ కాంపౌండ్ లో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అటు బాలీవుడ్ స్టార్ హీరోలు స‌హా మాలీవుడ్ స్టార్ హీరోలు క‌రోనాకి భ‌య‌ప‌డి షూటింగులు ఆపుకోలేదు. అక్ష‌య్ కుమార్ .. మోహ‌న్ లాల్ లాంటి స్టార్లు త‌మ సినిమాల షూటింగులు న‌డిపించేస్తున్నారు. అక్ష‌య్ కుమార్ అయితే ఒక‌డుగు ముందుకు వేసి ఏకంగా యూరప్ కే వెళ్లి షూటింగ్ చేస్తున్నారు. దీనిని బ‌ట్టి ఎక్క‌డికి వెళ్లినా కోవిడ్ నియ‌మ‌నిబంధ‌న‌ల్ని అనుస‌రిస్తూ షూటింగుల్లో పాల్గొనాల్సిందేన‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే అన‌వ‌స‌రంగా స‌మ‌యం వృధా కాకుండా మిగులుతుంది. అందుకే మ‌హేష్ షూటింగుకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇన్నాళ్లు వేచి చూసినా ఇక లాభం లేద‌నే ఈ నిర్ణ‌యం. అయితే  కోవిడ్ టైమ్ లో త‌మ ఫేవ‌రెట్ రిస్క్ తీసుకోవ‌డం ఫ్యాన్స్ కి మాత్రం న‌చ్చ‌డం లేదు. అస‌లు ఈ టైమ్ లో రిస్క్ ఎందుకు అన్న‌ది వారి ప్ర‌శ్న‌. కోవిడ్ తీవ్ర‌త లేని విదేశాల‌కు వెళ్లి షూటింగులు చేయాలా?  లేక ఇండియాలోనే షూటింగును పూర్తి చేయాలా? అన్న‌ది ప్ర‌స్తుతం ఆలోచిస్తున్నారు. స‌ర్కార్ వారి పాట క‌థానుసారం లోక‌ల్ గా కొంత చిత్రీక‌ర‌ణ చేయాల్సి ఉండ‌గా విదేశాల్లోనూ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ – జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.