అఫీషియల్ :’సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ నేమ్ బోర్డ్

అఫీషియల్ :’సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ నేమ్ బోర్డ్

రీసెంట్ గా మహర్షితో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కొత్త సినిమా ఈ మధ్యనే ప్రారంభమైన సంగతి తెలిసిందే. మహేష్‌ 26వ సినిమాగా డిఫరెంట్‌ కథని ఎంచుకున్నాడు. వరుస హిట్స్ తో సూపర్‌ ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు టైటిల్ తో ఈ సినిమాను ప్రారంభించాడు మహేష్‌. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనపడనున్నారు.

చిత్రంలోని మహేష్ బాబు పాత్ర పేరు తాజాగా రివీల్ చేసారు. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో ఆయన నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇప్పటికే కాశ్మీర్‌లో మూవీ షూటింగ్ మొదలైంది. ‘పోకిరి’లో కృష్ణ మనోహర్’ ఐపీఎస్‌గా కనిపించిన మహేష్ బాబు.. ‘దూకుడు’లో అజయ్ కుమార్ ఐపీఎస్‌గా నటించాడు. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’లో పోకిరిలో కృష్ణ, దూకుడులో అజయ్ కలిపి మేజర్ ‘అజయ్ కృష్ణ’గా అలరించనున్నాడు.

దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా యంగ్ సెన్సేషన్‌ రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.