మహేష్ హిట్టు సినిమాకు సీక్వెల్.. 17ఏళ్ళ తరువాత..

mahesh enjoying with family in foreign

మహేష్ బాబు కెరీర్ లో ఎన్ని బాక్సాఫీస్ హిట్స్ ఉన్నా కూడా ఆల్ టైమ్ బెస్ట్ హిట్స్ లలో నిలిచే మూవీ మాత్రం ఒక్కడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు వచ్చినా కూడా ఆ సినిమాకు ఉన్న పవర్ ఏ మాత్రం తగ్గదనే చెప్పాలి. 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ గా నిలిచింది. బాక్సాఫీస్ కలెక్షన్స్ తో ఒక్కసారిగా మహేష్ రేంజ్ ను పెంచేసింది.

ఆ సినిమా తరువాత మహేష్ టాలీవుడ్ అగ్ర హీరోల జాబితాలో చేరాడనే చెప్పాలి. ఇప్పటికి కూడా టీవీలలో వస్తే మంచి రేటింగ్స్ అందుకుంటుంది ఆ సినిమా. అయితే ఆ సినిమా నిర్మాత యంఎస్.రాజు ఇప్పుడు మరో సీక్వెల్ తో రెడీ కావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక్కడు 2 తీసి మళ్ళీ ఇండస్ట్రీలో తన హవా కొనసాగించాలని అనుకుంటున్నారట. అయితే అందుకు మహేష్ ఒప్పుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా మహేష్ రీమేక్ సినిమాలను సీక్వెల్ కథలను టచ్ చేయడానికి అంతగా ఇష్టపడడు. ఇక దర్శకుడు గుణశేఖర్ మరోసారి అలాంటి స్టోరీతోనే అంచనాలను అందుకోగలాడా అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం అనే సినిమా చేస్తున్నాడు