మహేష్ ఘాటు ముద్దుకు నమ్రత ఫిదా!

Namrata Shared Adorable Pic

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమత్ర జోడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ కపుల్స్‌‌లో మహేష్-నమ్రతది మొదటి స్థానం. ఇది అందరూ ఒప్పుకునేది. అందులో ఎలాంటి వివాదం ఉండదు. వీరి జంట ఎంత అందంగా ఉందో.. వీరి లవ్ ట్రాక్ కూడా అంతే అందంగా ఉంటుంది. వంశీ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అతడు సినిమా టైంలో వివాహా బంధంతో ఒక్కటయ్యారు.

Namrata Shared Adorable Pic
Namrata Shared Adorable Pic

మహేష్ బాబును వివాహం చేసుకున్న తరువాత నమత్ర పూర్తిగా సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి మహేష్ బాబే లోకంగా జీవితాన్ని గడిపేస్తోంది. మహేష్ బాబు వ్యవహారాలన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటుంది. మహేష్ సినిమా, వ్యాపారాలు, ప్రకటనలు, ఇతర విషయాలన్నీ నమత్రయే దగ్గరుండి చూసుకుంటుంది. ఇలా భర్తకు ప్రతీ విషయంలో తోడుగా ఉంటూ భార్య క ర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. ఇక సోషల్ మీడియాలో నమ్రత షేర్ చేసే ఫోటోలు, విషయాల గురించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.

మహేష్ బాబు తెరపై ఎలా ఉంటాడో మాత్రమే మనకు తెలుసు. అయితే ఇంట్లో పిల్లలతో, భార్యతో ఎలా ఉంటాడో తెలియాలంటే సోషల్ మీడియాలో నమత్రను ఫాలో అవ్వాల్సింది. మహేష్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని నమత్ర సోషల్ మీడియాలో పంచుకుంటుంది. నిన్న (ఆగస్ట్ 9) మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ పిక్‌ను పోస్ట్ చేసింది. అందులో మహేష్ ఎంతో ప్రేమతో ఘాడంగా పెట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘నీ వల్ల కలిగిన అనుభూతులే.. నిజమైన ప్రేమ.. హ్యాపీ బర్త్ డే ఎంబీ.. ఇప్పుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది.