సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’మొన్న గురువారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా సినిమా బాగానే వసూలు చేస్తోందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. మహేష్ కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లు దక్కుతున్నాయని,ఎపిక్ హిట్ అని అన్నారు. అదే సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. వీకెండ్ లో ఉన్న కలెక్షన్స్ ఆ తర్వాత మెల్లిగా తగ్గుమొహం పట్టడంతో వాటికి బూస్ట్ ఇవ్వటానికే మహేష్ ఇలా థియోటర్స్ కు వెళ్లటం, సక్సెస్ మీట్ పెట్టడం, రైతులతో మీటింగ్ లు పెట్టడం చేస్తున్నారని తెలుస్తోంది.
‘మహర్షి’ సినిమాలో రైతుల సమస్యలపై గళం విప్పడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ‘వీకెండ్ వ్యవసాయం’ అన్న కాన్సెప్ట్‌కు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. ఈ సినిమాలో సీఈవో పదవికి రిషి (మహేష్ ) రాజీనామా చేసి.. భారత్‌కు వచ్చి వ్యవసాయం చేశారు. నిజ జీవితంలో కూడా ఇలాంటి ‘రిషి’లు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు మహేష్ తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. మహేష్ .. రైతులతో పంచుకున్న విషయాలను మీరూ ఈ క్రింద లింక్ లో చూడవచ్చు.
ఈ నేపథ్యంలో ఓ మహిళ పంట చేతికి రాక తన బంధువులు ఆత్మహత్య చేసుకోవడం గురించి వివరించారు. ఆమె మాటలు విన్న మహేష్ .. ‘మీరు మాకెంతో స్ఫూర్తిదాయకం. నేను ఇప్పటివరకు కలిసిన గొప్ప వ్యక్తుల్లో మీరొకరు. హ్యాట్సాఫ్ టు యూ. మీరున్నారు కాబట్టే మేమున్నాం’ అన్నారు.