మ‌హాన‌టి డైరెక్టర్ టాప్ హీరో గారి కోసం కథ సిద్ధం !

మ‌హాన‌టి హిట్ తో యంగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. వ‌య‌సులో చిన్న వాడైన,మ్యాట‌ర్ ఉన్న వాడిన‌ని రెండ‌వ సినిమాతోనే నిరూపించాడు. నాగ అన్వేష్.

మ‌హాన‌టి రిలీజ్ అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నాగ్ అశ్విన్ ను ఇంటికి పిలిపించి లంచ్ పార్టీ ఇచ్చారు. అనంత‌రం ఘ‌నంగా స‌న్మానించారు. ఆ స‌మ‌యంలోనే త‌న‌కు ఒక మంచి క‌థ ఉంటే సిద్దం చేయ్ అని చిరు బహిరంగంగా ప్ర‌క‌టించారు. అది సోష‌యా ఫాంట‌సీ నేప‌థ్యంలా ఉండాలి. పాతాళ భైర‌వి క‌థ‌లా ఉండాల‌ని ఓ హింట్ కూడా ఇచ్చారు. ఆ మాట‌ను సీరియ‌స్ గా తీసుకున్న నాగ్ అశ్విన్ అప్ప‌టి నుంచి చిరు కోసం క‌థ సిద్దం చేసే ప‌నిలోనే ఉన్నాడ‌ని తాజాగా తెలిసింది.

చాలా మంది నిర్మాత‌లు త‌మ బ్యాన‌ర్లో సినిమా చేయ‌మ‌ని అడ్వాన్సులు తీసుకుని ఇంటికొచ్చి ఆఫ‌ర్ ఇచ్చినా కాదంటున్నారుట‌. చిరు ప్రామిస్ చేసారు కాబ‌ట్టి నాగ్ అశ్విన్ క‌థ తో మెప్పిస్తే ఛాన్స్ తప్ప‌క ఉంటుంది. వాళ్ల బ్యానర్ లో చేసే ఛాన్స్ ఉంది. చేస్తే కొణిదెల మరియు అశ్విని దత్ గారి కలిసి చేసే పని లో ఉన్నారు.