గేయ‌ర‌చ‌యిత సుద్దాల‌కు కాలేయ మార్పిడి చికిత్స‌

అనారోగ్యంతో గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆసుపత్రిలో చేరారు. ఆయ‌న‌ కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని స‌మాచారం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆసియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు చేర్చారు. వైద్య‌ పరీక్షల అనంత‌రం వైద్యులు ఇప్పుడు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నారు. మార్పిడి కోసం కుటుంబ సభ్యులు బి-నెగెటివ్ రక్త ధాత‌ల కోసం వేచి చూస్తున్నార‌ని స‌మాచారం.

సుద్దాల అశోక్ తేజ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. `అల్లూరి సీతా రామరాజు` చిత్రంలో `తెలుగు వీర లెవరా…` తో శ్రీశ్రీ‌… ‘రాలి పోయె పువ్వా నీకు రాగలేందుకే’ పాట‌తో సుందరరామమూర్తి జాతీయ అవార్డుల‌ను గెలుచుకున్నారు. ఆ ఇద్ద‌రి త‌ర్వాత ఉత్తమ సాహిత్యానికి జాతీయ అవార్డును గెలుచుకున్న మూడవ తెలుగు గీత రచయితగా సుద్దల అశోక్ తేజ సుప‌రిచితం.

చిరంజీవి ఠాగూర్‌లోని సుద్దాల అశోక్ తేజ పాట `నేను సైతం…` పాట‌కు జాతీయ అవార్డు దక్కింది. సుద్ధాల‌కు ఈ పాట ఎంతో గౌర‌వం గుర్తింపును తెచ్చింది. ఈ పాట‌ను మహాప్రస్థానం నుండి శ్రీ శ్రీ సాహిత్యం నేను సైతం నుంచి ప్రేరణ పొంది ఆయ‌న ర‌చించారు. టాలీవుడ్‌లోని సూపర్ హిట్ చిత్రాలలో సుద్దల అశోక్ తేజ అనేక పాపులర్ పాటలు రాశారు.