ఆ వినాయకుడు పేరు చెప్పి చెర్రీ ఫ్యాన్స్ రచ్చ,మిగతా హీరోల ఫ్యాన్స్ గోల

గతంలో  ‘గబ్బర్ సింగ్’   పవన్ కళ్యాణ్ గెటప్ లో గణేశుడు.. ‘బాహుబలి’ గణేశుడిని చూసాం.  తాజాగా రంగస్థలం చిట్టిబాబు గెటప్ లో గణేశుడు ఈ ఏడాది కొన్ని మండపాలలో కొలువుతీరాడు.  ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అదే. వైజాగ్ లోని ఓ పందిరి వద్ద ఈ గణేశుడుని నిలబెట్టారు.

దాంతో ఎక్కడెక్కడ రామ్ చరణ్ అభిమానులు వచ్చి తమ అభిమాన హీరో గెటప్ లో ఉన్న వినాయకుడుని చూసి వెళ్తున్నారు. కొందరు మరీ ఉత్సాహంగా ఆ వినాయకుడుతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.  ఈ ఫొటోని పెట్టి తమ హీరో ఘనత ఇది అని ఫ్యాన్స్ ఫేస్ బుక్, ట్విట్టర్ లో ప్రకటనలు చెయ్యడం మిగతా ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు.

దాంతో పవన్, ప్రభాస్ ఫ్యాన్స్..గబ్బర్ సింగ్ గెటప్ లో ఉన్న వినాయకుడుని, బాహుబలి గెటప్ వినాయకుడు ఫొటోలతో హల్ చల్ చేయటం మొదలెట్టారు. ఇదంతా ఇలా ఉంటే సినిమా హిరోలతో వినాయకుడుని ముడిపెట్టడం చాలా మంది సంప్రదాయవాదులకు మింగుడుపడటం లేదు.

వారు భగవంతుడుని ఇలాంటి గెటప్ లో చూపుతూ పూజలు చేయటం ఎంతవరకూ సమంజసం అంటున్నారు. అయితే దానికి కౌంటర్ మన హీరోల అభిమానుల దగ్గర ఉంది. ఏం దేవుడు పందిళ్ల వద్ద సినిమా పాటలు వేయటం లేదా..రోజంతా..ఏమన్నా భక్తి పాటలు వేస్తున్నారా…అంటూ నిలదీస్తున్నారు. ఏదైమైనా ఇదో కొత్త ట్రెండ్..కొత్త టాపిక్ ..ఏమంటారు.