ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకోరు? ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఎందుకనుకోరు. అందరూ కొరుకుంటారు. ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటారు. దానికి తగ్గ మూల్యం తర్వాత చెల్లిస్తారనుకోండి. లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మద్యం షాపులు సహా అన్నింటికి తాళం పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మద్యం ప్రియులు మందు లేక నానా అవస్థలు పడ్డారు. ప్రత్నామ్యాయ మార్గాలను వెదుకుక్కుని దొరికిన వాళ్లు తాత్కాలిక ఆనందాన్ని పొందారు. అయినా నిత్యం తెలుగు రాష్ర్టాల్లో ఏరుల్లా పారే మద్యం ఒక్కసారిగా చుక్క కూడా దొరకకపోవడంతో! ఎన్నెన్ని అవస్తలు పడ్డారో? ఆ దేవుడు కే కాదు అందరికీ ఎరుకే.
మతి భ్రమించి భార్యలు భర్తల్ని తన్నడం..భార్యల్ని భర్తలు రాచి రంపాన పెట్టడం జరిగింది. ఆ సన్నివేశాలను ఉద్దేశించి రాంగోపాల్ వర్మ ప్రభుత్వాలకు సలహాలిచ్చి చీవాట్లు తినడమూ జరిగింది. ఇదంతా గతం…తాజాగా సోమవారం నుంచి మళ్లీ మద్యం షాపులు రీఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 వరకూ మద్యం అమ్ముకొవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం ప్రియులు షాపులు ముందు బారులు తీరారు. దాదాపు 50 రోజుల తర్వాత వైన్ షాపులు తెరుచుకోవడంతో మందు బాబులు షాపులకు కొబ్బరి కాయలు కొట్టి హారతి పట్టి మరీ ఓపెన్ చేసారు. మద్యం షాపుల వద్ద పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసి సామాజిక దూరం పాటిస్తూ మద్యం అమ్ముకోండని మందుబాబులను వదిలేసింది. కానీ నిన్న మద్యం షాపుల ముందు జనాల్ని చూస్తే దిమ్మ తిరిగిపోయింది. నిత్యావసర సరుకులు కోసం కూడా ఇంత జనం ఎక్కడా కనిపించలేదు. ఇక తెలంగాణ లో మద్యం షాపుల తాళాలు తీయాలా? లేదా? అని కేసీఆర్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.
గత కొన్ని రోజులుగా మద్యం లేకపోవడంతో అక్కడా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో! తెలిసిందే. దీంతో అక్కడి మద్యం ప్రియులంతా ఏపీ బోర్డర్ కు చేరుకుని పోలీసులు కళ్లు గప్పి మద్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ ఆర్టిస్టులు…టెక్నిషీయన్లు కూడా మద్యం భారీ ఎత్తున హైదరాబాద్ కి తరలిస్తున్నట్లు లీకులందు తున్నాయి. టాలీవుడ్ మత్తులో మునిగి తేలుదుందని గతంలో చాలా ఆరోపణలొచ్చాయి. అలాంటింది అక్కడా మద్యం దొరకకపోవడంతో ఏపీ నుంచి తరలిస్తోన్న మద్యాన్ని ఫిలిం సర్కిల్స్ లో బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
