“NBK 107” షూటింగ్ పై అప్డేట్..బాలయ్య రేపు ఎక్కడ ల్యాండ్ అవ్వనున్నాడంటే.!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాసెస్ట్ హీరోస్ లో ఒకరైన నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా తెరకెక్కిస్తుండగా షూటింగ్ అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా జరుగుతుంది.

ఇక ఇప్పుడు అయితే సీమ ప్రాంతంలో షూటింగ్ ని బాలయ్య చేస్తుండగా కొన్ని ఫోటోలు మరియు కొన్ని వీడియోలు కూడా బయటకి లీకయ్యి వైరల్ కూడా అయ్యిపోయాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ పై సినీ వర్గాల నుంచి ఒక కన్ఫర్మేషన్ వార్త బయటకి వచ్చింది.

మరి దీని ప్రకారం అయితే మేకర్స్ రేపు జూలై 25 నుంచి కొండా రెడ్డి బురుజు ప్రాంతంలో షూటింగ్ చేయనున్నారట అంతే కాకుండా హోటల్ మౌర్య ప్రాంతంలో కూడా కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారట. సో బాలయ్య  అవ్వనున్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే ధనంజయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు భారీ బడ్జెట్ తో కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.