లేటెస్ట్ టాక్ : “కార్తికేయ 2” ఓటీటీ సందడికి కూడా కొత్త డేట్ ఖరారు అయ్యిందా?

Karthikeya 2 movie review

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచినటువంటి చిత్రాల్లో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచిన చిత్రం “కార్తికేయ 2” కూడా ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. 

మరి ఈ చిత్రం అయితే ఆగష్టు లో రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మంచి రన్ లో కొనసాగుతుంది. ఇక హిందీలో అయితే కేవలం 50 లక్షలకి అమ్ముడుపోయిన ఈ చిత్రం ఏకంగా 33 కోట్ల భారీ వసూళ్లు అందుకొని అదరగొట్టింది.

ఇలా ఇప్పటివరకు థియేటర్స్ లో సెన్సేషనల్ రన్ ని కొనసాగించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా బయటకి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఈ సినిమా ని జీ 5 వాళ్ళు ఈ అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తారట.

ముందు అయితే ఈ సెప్టెంబర్ 30న అన్నట్టు టాక్ వచ్చింది కానీ తాజాగా అయితే ఈ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఇక ఈ సినిమాలో అయితే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అలాగే అనుపమ్ ఖేర్ బాలీవుడ్ నుంచి కీలక పాత్రలో నటించారు.