NBK 107 : ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అవైటెడ్ అప్డేట్ రాబోతోందా.?

ప్రస్తుతం నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా తన కెరీర్ లో 107వ సినిమా చేస్తున్నారు. మరి దీని కన్నా ముందు టేకప్ చేసిన భారీ చిత్రం “అఖండ” సంచలన విజయం అందుకోవడంతో ఇప్పుడు తీస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ శరవేగం చిత్రీకరణ జరుపుకుంటుండగా అభిమానుల్లో మాత్రం గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా టైటిల్ అప్డేట్ పై ఆసక్తి అలా కొనసాగుతుంది. ఇక ఈ చిత్రానికి “జై బాలయ్య” అలాగే “అన్నగారు” అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్ పరిగణలో ఉండగా..

ఈ అనౌన్సమెంట్ అతి త్వరలోనే రానున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు లేటెస్ట్ సమాచారం తెలుస్తుంది. అలాగే ఇంకో ఆసక్తికర టాక్ ఏమిటంటే ఈ చిత్రం నుంచి ఈ వారాంతంలో కూడా నెక్స్ట్ వీకెండ్ లో కానీ ఓ అప్డేట్ ని అయితే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా లేటెస్ట్ గా బాలయ్య వర్గాల నుంచి వినిపిస్తుంది.

ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.