ఎన్నికల్లో పోటీ చేయనున్న మంచు లక్ష్మి

మంచు లక్ష్మి గురించి తెలియని తెలుగు వారుండరు అనడంలో అతిశయోక్తి లేదేమో. మోహన్ బాబు కూతురుగా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఉన్నారుగాని, సినిమా వారసరాళ్లు చాలా అరుదు. మంచు లక్ష్మి ఈ విషయంలో ట్రెండ్ సెట్ చేసింది. అంతేకాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2011 లో విడుదల అయిన “అనగనగా ఒక ధీరుడు” సినిమాతో తెలు తెరకు పరిచయమైనా లక్ష్మి ఆ సినిమాకి బెస్ట్ విల్లన్ గా ప్రతిష్టాత్మక నంది అవార్డును సొంతం చేసుకుంది. 2014 లో విడుదల అయిన చందమామ కధలు సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నంది అవార్డు గెలుచుకుంది. వీటితోపాటు ఫిలిం ఫేర్ అవార్డులను ఆమె కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఇటు టీవీ షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మంచు లక్ష్మి త్వరలో ఎన్నికల బరిలో దిగనుంది అని సమాచారం.

ప్రతి రెండేళ్లకు ఒకసారి మా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో రానున్న మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారట లక్ష్మి మంచు. సీనియర్ నటుడు నరేష్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే లక్ష్మి మంచుకి ప్రత్యర్థిగా నిలబడనున్న నరేష్ కి చిరంజీవి మద్దతు ఇస్తున్నట్టు ఫిలిం నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

2017 , మార్చిలో శివాజీరాజా ఏకగ్రీవంగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు. 2015 మా ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి జయసుధ పోటీ పడ్డారు. 2015 మా అధ్యక్ష పదవి ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. జయసుధ వర్గాలు, రాజేంద్రప్రసాద్ శ్రేణులు ఢీ అంటే ఢీ అన్నట్టు పోటీ పడ్డారు. జయసుధ గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు.

ఇప్పుడు మంచు లక్ష్మికి వ్యతిరేకంగా పోటీలో నిలబడుతున్న నటుడు నరేష్ కి చిరంజీవి సపోర్ట్ ఉంటె ఈ ఎన్నికలు కూడా హాట్ హాట్ గా సాగె అవకాశం ఉంది. అసలే మోహన్ బాబుకి, చిరంజీవికి పడదు అనేది చాలా సార్లు బహిరంగంగానే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు మోహన్ బాబు, చిరంజీవి మధ్య జరుగుతున్న పోటీగా తలపించడంలో సందేహం లేదు అంటున్నాయి ఫిలిం వర్గాలు.