ల‌క్ష్మీ మంచు – బిగ్ బాస్‌కే స‌వాల్ విసురుతున్నారా?

బిగ్ బాస్‌`కి జీ`హీరోస్` బ‌స్తీ మే స‌వాల్

ల‌క్ష్మీ మంచు ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం గురించి తెలిసిందే. న‌టి, నిర్మాత‌, బుల్లితెర హోస్ట్ గా సుప‌రిచితం. నేను సైతం, ల‌క్ష్మీ టాక్ షో వంటి కార్య‌క్ర‌మాల్ని బుల్లితెరపై విజ‌య‌వంతంగా నడిపించారు. ప్ర‌స్తుతం మ‌రో రియాలిటీ షోకి హోస్టింగ్ కి రెడీ అవుతున్నారు. ప్ర‌ఖ్యాత ఎంట‌ర్‌టైన్‌మెంట్ చానెల్ జీ-తెలుగు త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న ఈ రియాలిటీ షో పేరు హీరోస్. ఇదో డిఫ‌రెంట్ కాన్సెప్టుతో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నుంద‌ట‌. థాయ్ ల్యాండ్ లోని అడ‌వుల్లో గ‌గుర్పొడిచే సాహ‌సాల నేప‌థ్యంలో ఈ రియాలిటీ షోని ప్లాన్ చేశారు. ఈ కాంటెస్ట్ లో ప‌ది డేర్ డెవిల్‌ ఛాలెంజెస్ ని కంటెస్టెంట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ రియాలిటీ షోలో పాల్గొనే వారి జాబితాని తాజాగా రివీల్ చేశారు. బిగ్ బాస్ సీజ‌న్ 2 కంటెస్టెంట్స్ స‌మ్రాట్, తేజ‌స్వి మ‌దివాడ, గాయ‌కుడు అనుదీప్, అత్తారింట్లో అక్క చెల్లెలు లీడ్ న‌టుడు ఆక‌ర్ష్‌, రోడీస్ కంటెస్టెంట్ మిలింద్ చాంద్వానీ, జ‌బ‌ర్థ‌స్త్ ఫేం రామ్ ప్ర‌సాద్, క‌మెడియ‌న్ విద్యుల్లేఖ‌, న‌టి అపూర్వ శ్రీ‌నివాస‌న్- ముద్ద మందారం ఫేం సునంద మాల శెట్టి, మిస్ ఇండియా ఏపీ శ్రిష్ఠి వ్యాక‌ర‌ణం .. ఇలా ప‌ది పేర్ల‌ను ఫైన‌ల్ చేశారు. ఆగ‌స్టు 4 న 9పీఎం ప్రీమియ‌ర్ తో జీచానెల్ యాక్ష‌న్ ప్లాన్ రెడీగా ఉంది. ఈ కార్య‌క్ర‌మంతో బిగ్ బాస్ కి పోటీకెళ్లాల‌నేది ప్లాన్. స్టార్ మా బిగ్ బాస్ రియాలిటీ షో మాస్ కి బాగా క‌నెక్ట‌య్యింది. అయితే ఆ ఆడియెన్ ని త‌మ షో వైపు తిప్పుకునేందుకు చాలానే ఎత్తుగ‌డ‌లు వేస్తోంద‌ట‌.