వైరల్ : మెగా ఫ్యాన్స్ ని ఒక్క మాటతో పడేసిన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి.!

తెలుగు సినిమా దగ్గర చాలా వరకు తమ మొదటి సినిమాతో హిట్ అందుకొని మళ్ళీ అదే ఊపులో అనేక సినిమాలు చేయడం అనేది చాలా తక్కువ మంది హీరోయిన్స్ కే సొంతం అవుతుంది. అలా లేటెస్ట్ గా తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యి ఫస్ట్ సినిమా “ఉప్పెన” తో ఏకంగా 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో జాయిన్ అయ్యిన హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి నిలిచింది.

ఇక అక్కడ నుంచి మరిన్ని సాలిడ్ ఆఫర్స్ తో దూసుకెళ్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈమె హీరోయిన్ గా నటించిన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా తో పలకరించేందుకు వచ్చింది. మరి ఈ సమయంలో తన సోషల్ మీడియా ద్వారా ఒక క్విక్ చాట్ సెషన్ పెట్టగా హీరోలపై కొన్ని ఇంట్రెస్టింగ్ రిప్లై లు ఆమె ఇచ్చింది.

అలా మెగా హీరోస్ విషయంలో కూడా క్రేజీ ఆన్సర్ ని ఇచ్చింది. ఓ ఫాలోవర్స్ పవన్ ఫొటోస్ కొన్ని పెట్టి పవన్ కోసం ఒక మాట అడగగా “నేను కూడా మీలానే మెగా ఫ్యాన్ నే” అంటూ తెలిపింది. దీనితో ఈ సమాధానం దెబ్బకు మెగా ఫ్యాన్స్ అంతా స్టన్ అయ్యిపోయారు. ఇక ఇప్పుడు ఈ రిప్లై మెగా ఫ్యాన్స్ లో కొత్త ఎనర్జీ ఇవ్వడంతో వైరల్ గా మారింది.