మ‌హేష్ డ్యాన్సుల‌పై కృష్ణ రెస్పాన్స్ ఇదీ

మహేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఫార్ములాటిక్ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. అనీల్ రావిపూడి అన్ని మ‌సాలాల్ని ద‌ట్టించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ప్యాకేజీ అన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ మూవీలో మ‌హేష్ డ్యాన్సుల‌కు అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. నెవ్వ‌ర్ బిఫోర్ అన్న స్టెప్పులేసి మ‌హేష్ మైండ్ బ్లాకింగ్ చేసేశాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ ఎలా ఫీల‌వుతున్నారు? అంటే.. ఆయ‌న చాలా సంతోషం వ్య‌క్తం చేశారు. ఇదే విష‌యాన్ని అనీల్ సుంక‌ర ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. మహేష్ డాన్సులు, నటన హైలైట్. అనిల్ రావిపూడి ఈ మూవీని తీర్చిద్దిన విధానం నచ్చిందట. ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ -ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ – శ్రీ‌వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్ల‌లో ఈ చిత్రం తెర‌కెక్కింది. కృష్ణ‌గారి ప్ర‌శంస‌ల‌కు ఏకే అధినేత అనీల్ సుంక‌ర తాజాగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ చిత్రంలో రష్మిక మంద‌న హీరోయిన్ గా నటించింది. విజయ శాంతి, ప్రకాష్ రాజ్, సంగీత, రావు రమేష్ వంటి నటులు ఇతర కీలక పాత్రలలో నటించారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర చిత్రాన్ని నిర్మించగా దేవిశ్రీ సంగీతం అందించారు.