సంపూ నీలో ఈ కళ కూడా ఉందా, ఇరక్కొట్టావు పో

సంపూ నీలో ఈ కళ కూడా ఉందా, ఇరక్కొట్టావు పో

‘హృదయ కాలేయం’ చిత్రంతో పరిచయం అయిన సంపూర్నేష్‌బాబుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సంపూకు ఉన్న క్రేజ్ వేరే కామెడీ హీరోలకు లేదు. అయితే హృదయకాలేయం తర్వాత చాలా సినిమాలు సంపూ చేసినా పెద్దగా క్లిక్ అయినవి లేదు. ఈ సినిమా విడుదలైన వెంటనే మొదలు పెట్టిన చిత్రం ‘కొబ్బరిమట్ట’.

రకరకాల కారణాలతో ఈ చిత్రం లేటు అవుతూ వస్తోంది. దాదాపు నాలుగున్నర సంవత్సరాల క్రితం ‘కొబ్బరి మట్ట’ చిత్రాన్ని ప్రకటించారు. మద్య మద్యలో పాట విడుదల చేయడం, పోస్టర్‌లు విడుదల చేయడం చేస్తూ వచ్చారు కానీ రిలీజ్ చేయలేదు. కాని సినిమాకు మాత్రం ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. సాయి రాజేష్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘కొబ్బరి మట్ట’ చిత్రం ఎట్టకేలకు విడుదల కాబోతుంది. దాంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా ఓ పాటను సైతం రిలిజ్ చేసారు. ఆ పాటలో సంపూ డాన్స్ లు ఇరగతీసాడని అందరూ అంటున్నారు. మీరు కూడా చూసి నిజమే అని కన్ఫర్మ్ చేయండి.

A..Aa..E..Ee Song Teaser | Kobbari Matta Songs | Sampoornesh Babu | Rupak Ronaldson | Kamran

సంపూ తప్పకుండా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సంపూర్నేష్‌బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ఒక పాత్రకు ఏకంగా ముగ్గురు భార్యలు ఉంటారు. అలాగే ఈ చిత్రం కోసం సంపూర్నేష్‌బాబు ఒక పాటను కూడా పాడటం జరిగింది. ఆ పాట ఆమద్య భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 19న విడుదల కానుంది.