`బిగ్ బాస్ 4` కోసం కింగ్ ప్ర‌యోగం.. ముస‌లాడిగా ఏంటీ షాక్‌?

Solid changes made for Bigg Boss 4

బుల్లితెర‌పై ఎంతో గొప్ప టీఆర్పీని కొట్టేస్తున్న రియాలిటీ షో ఏది?  బుల్లితెర‌పై ఎంతో ఇదిగా ఆడియెన్‌కి బోర్ కొట్టించేది ఏది? అంటే.. ఈ రెండిటికీ విరుద్ధ భావాలున్న‌ రెండు వ‌ర్గాలు ఇచ్చే ఏకైక ఆన్స‌ర్ `బిగ్ బాస్` షో. మాస్ కి ఈ షో ఎక్కినా కానీ మెజారిటీ క్లాస్ ఆడియెన్‌కి అస్స‌లు న‌చ్చ‌ని షో ఇది. సాంప్ర‌దాయ వాదులు అయితే ఉమ్మేస్తారు. ఇప్ప‌టికీ ఈ షోపై నిరంత‌రం కోర్టుల ప‌రిధిలో కేసులు వేసేవాళ్లు ఉన్నారు.

అటు హిందీ.. త‌మిళం.. ఇటు తెలుగులో ఇదే ప‌రిస్థితి. కాస్టింగ్ కౌచ్ లాంటి వాటిని ఈ రియాలిటీ షో ఇమేజ్ పెంచేందుకు ప్ర‌చారానికి ఉప‌యోగించుకునే ఎత్తుగ‌డ‌లు వేయ‌డంపై స్టార్ మాపై ఇంత‌కుముందు తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తెలుగులో సీజ‌న్ 3 కి ముందే  ఈ త‌ర‌హా గొడ‌వ‌లు బిగ్ బాస్ ఇమేజ్ ని కిందికి దించేశాయి.

ఈసారి సీజ‌న్ 4 కి రంగం సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా నాగార్జున హోస్ట్ గా ప్రోమో కూడా రిలీజైంది. ఈ ప్రోమోలో నాగార్జున వృద్ధ గెట‌ప్ షాకిస్తోంది. ఆయ‌న గోపీ.. అంటూ ఏదో కొత్త పేరు తెర‌పైకి తెచ్చారు? ఇంత‌కీ ఎవ‌రా గోపి? ఏమిటా ట్విస్ట్? అన్న‌ది కాస్త ఆగి చూడాలి.

దాదాపు 100 రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో స‌భ్యులు ట్రీటిస్తార‌ట‌. ఇందులో యాంక‌ర్లు.. హీరోయిన్లు ఇచ్చే ట్రీట్ ని చాలా స్పెష‌ల్ గా డిజైన్ చేశార‌ట‌. సీజ‌న్ 3ని విజ‌య‌వంతంగా న‌డిపించిన హోస్ట్ నాగార్జున ఈసారి ఎంత రంజుగా న‌డిపిస్తారు? అన్న‌ది చూడాలి. రొటీనిటీని న‌మ్ముకోకుండా బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఈసారి కొత్త‌గా ఏం చేశారు? అన్న‌ది కూడా చూడాలి.

Next em jarugutundo chudataniki stay tuned!!! 'BiggBossTelugu4' coming soon on Star Maa