పక్కరాష్ట్రం డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు.. ఈ సినిమా ఒప్పుకో ప్లీజ్ అంటున్న ఫాన్స్ !

KGF director prasanth neel planning to direct ram charan

రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి కొడుకే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. చిరంజీవి పేరుతో సినిమాల్లోకి వచ్చినా.. తను సొంతంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగాడు. ముఖ్యంగా తన డ్యాన్స్, ఫైట్స్ తో సినీ అభిమానులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హోదాను అనుభవిస్తున్నాడు.

KGF director prasanth neel planning to direct ram charan
KGF director prasanth neel planning to direct ram charan

ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఈ సంవత్సరమే విడుదల కావాల్సి ఉంది కానీ.. కరోనా వల్ల వాయిదా పడింది. వచ్చే సంవత్సరం ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రాంచరణ్ లుక్ కూడా విడుదలయింది. ఇక.. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో పాటుగా… మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అలాగే ఆ సినిమాలో కీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు.

అయితే.. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా తమ తదుపరి చిత్రాలను కూడా ఇప్పుడే ప్రకటించేస్తుండటంతో.. తమ అభిమాన నటుడు రాంచరణ్ తదుపరి సినిమాలు ఏంటా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అయితే.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాంచరణ్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పేరు ఒక్కసారిగా భారతదేశ సినీ ఇండస్ట్రీలోనే మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అందరు హీరోలు ఆయనతో ఒక్క సినిమా అయినా తీయాలని వెంటపడుతున్నారు.

కానీ.. విచిత్రంగా ప్రశాంత్ నీల్ మాత్రం రాంచరణ్ తో ఓ సినిమా తీయాలని సన్నాహాలు చేస్తున్నాడట. అయితే.. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడంటూ మరో టాక్ వినిపిస్తుంది.

దీంతో ప్రశాంత్ నీల్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను రాంచరణ్ తో చేస్తాడా? రాంచరణ్ దీనికి ఒప్పుకున్నాడా? అనే విషయాలపై మాత్రం క్లారిటీ రావట్లేదు. మెగా అభిమానులు మాత్రం కేజీఎఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తే.. అదిరిపోవాల్సిందే.. అంటూ ఖుషీ అవుతున్నారు.