మహానటి కీర్తి సురేష్ తెరపై ఎంత పద్దతిగా కనిపిస్తుందో నిజ జీవితంలోనూ అంతే ఉంటుంది. ఎవరితో ఎంత వరకు ఉండాలే అంత వరకే ఉంటుంది, ఇప్పటి వరకు కీర్తి సురేష్‌పై ఎలాంటి గాసిప్, రూమర్లు వంటివి రాలేదు. క్లీన్ ఇమేజ్‌తో కీర్తి దూసుకెళ్తోంది. తెరపైనా అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉంటుంది. కోట్లు కుమ్మరించినా సరే బికినీ మాత్రం ధరించదు. అలాంటి కీర్తి సురేష్ తాజాగా ఓ మ్యూజిక్ డైరెక్టర్‌తో చనువుగా ఉంది.
కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌తో కీర్తి అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఇద్దరికి ఒక కామన్ పాయింట్. వీరిద్దరి బర్త్ డేల్లో ఒక రోజు మాత్రమే తేడా. అనిరుధ్ బర్త్ డే నిన్న (అక్టోబర్ 16). కీర్తి సురేష్ బర్త్ నేడు (అక్టోబర్ 17). అలా వీరిద్దరూ ఒకే చోట ఉండి బర్త్ డే పార్టీలు చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు కీర్తి సురేష్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక కీర్తి సురేష్ అనిరుధ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ ఫోటోలను షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే డియర్ అనిరుధ్.. నీకు ముందంతా మంచి జరగాలి.. వచ్చే ఏడాది నీకు శుభాలే కలగాలి అని కోరుకుంది. ఇంకొన్ని గంటల తరువాత నాక్కూడా విషెస్ చెబితే మంచిది అంటూ కన్ను కొట్టిన ఎమోజీని షేర్ చేసింది. ఇక ఈ ఫోటోల్లో కీర్తిపై అనిరుధ్ చేతలు వేసి దగ్గరగా హత్తుకోవడంతో ఇద్దరి మధ్య అంత చనువుందా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలే అనిరుధ్ అంటే ఆండ్రియాతో గడిపిన చేసిన రాసలీలలు నెటిజన్లు ఇంకా మరిచిపోలేదు.