మహేష్ మళ్లీ పొరపాటు..ఓ రేంజిలో ట్రోలింగ్

గతంలోలా కాకుండా ఇప్పుడు హీరోలు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు ఎప్పటి కప్పుడు టచ్ లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. స్టార్స్ కూడా తమ ఫ్యాన్ బేస్ ని గౌరవిస్తూ ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పండుగ శుభాకాంక్షలు, అప్ డేట్స్ ఇస్తున్నారు. అలాగే మహేష్ కూడా విజయ దశమి సందర్బంగా తన అభిమానులకు విషెష్ తెలిపారు. అయితే చిక్కు అక్కడే వచ్చి పడింది.

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లోని త‌న అభిమానుల‌కు మ‌హేష్ విషెస్ చెప్పాడు. ఐదు భాష‌ల‌లో విషెస్ చెప్పిన మ‌హేష్ క‌న్న‌డ అభిమానుల‌ని విష్ చేయ‌డం పొరపాటున మ‌ర‌చిపోయాడు. దీంతో వారు మ‌హేష్‌ని వాళ్లు ఓ రేంజిలో ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.  ఈ విషయం పీఆర్వో ద్వారా తెలుసుకున్న మహేష్ వెంటనే తప్పు దిద్దుకున్నారు.   క‌న్న‌డ‌లోను మ‌హేష్ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపి వారిని శాంతింప చేసారు.

ఇంతకు ముందు కూడా  ఇలాంటి ఎక్సపీరియన్స్  మ‌హేష్‌కి ఎదురైంది. భ‌ర‌త్ అనే నేను చిత్రం భారీ విజ‌యం సాధించ‌డంతో .. ఇంత పెద్ద విజ‌యాన్ని అందించిన అభిమానుల‌కి కృత‌జ్ఞ‌త‌లు ఇంటూ తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ట్వీట్ చేశాడు. దీనిపై కన్నడ ప్రజలు మహేష్‌ బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

 క‌న్న‌డ‌లో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మ‌రి మీకు మేము క‌నిపించ‌డం లేదా, మా భాష‌లో  ధాంక్స్ చెప్ప‌లేక‌పోయారా అంటూ ఫైర్ అయ్యారు. కన్నడ అభిమానులపై మీరు చూపించిన ఈ పక్షపాతం అస్సలు బాగోలేద‌ని కొంచెం ఘాటుగానే హెచ్చరికలు జారీ చేసారు.   అప్పుడు కూడా ఇలాగే మ‌హేష్ త‌న ఫేస్ బుక్ పేజ్ , ట్విట్ట‌ర్ పేజ్ ద్వారా క‌న్న‌డిగుల‌కి కూడా వారి భాష‌లో ధ‌న్య‌వాదాలు చెప్పి కూల్ చేసారు. మళ్లీ మళ్లీ మహేష్ ఈ పొరపాటు చెయ్యకుండా ఉంటే బెస్ట్.