బికినీలో సంపుతున్న కంచె బ్యూటీ

                                        అర‌కొర బ‌ట్ట‌ల‌తో సంప‌కే పిల్లా

కంచె చిత్రంతో ట్రెడిష‌న‌ల్ గాళ్ గా మెరిసిపోయింది. ఓ సెక్ష‌న్ ఆడియెన్ లో గుబులు పుట్టించిన ఈ బ్యూటీలో అంత‌కుమించి వేడెక్కించే కోణం ఉంద‌ని కాల‌క్ర‌మంలో బ‌య‌ట‌ప‌డింది. అయితే అనూహ్యంగా మంచు కాంపౌండ్ లో అడుగు పెట్టి ఆచార్య అమెరికా యాత్ర‌లో న‌టించింది. ఆ సినిమా మాటేమో గానీ ఆ త‌ర్వాత ఐపు లేకుండా పోయింది. హ‌న్సిక త‌ర‌హాలోనే ప్ర‌గ్య కూడా ఇండ‌స్ట్రీ నుంచి మ‌టుమాయ‌మైంది.

తెలిసి చేసినా తెలియ‌క చేసినా త‌ప్పు త‌ప్పే క‌దా! ప్ర‌గ్య కెరీర్ ప్ర‌స్తుతానికి జీరో. ఇప్పుడు ఈ స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌ప‌డేదెలా? అన్న‌ది తెలీక ప్ర‌గ్య ఏం చేస్తోందో తెలుసా?  నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో యూత్ కి మెంట‌లెక్కించేస్తోంది. అందులో ఎక్కువ‌గా బికినీ ఫోటోలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

అప్పుడ‌ప్పుడు పొగలు క‌క్కే జిమ్ ఫోటోలు వీడియోల‌తోనూ ఆ రేంజులోనే విరుచుకుప‌డుతోంది. ప్ర‌గ్య ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో ఇన్ స్టా మొత్తం నిండిపోయింది. ఇందులో ఎక్కువ‌గా బికినీకే ప్రాధాన్య‌త‌నిచ్చింది అమ్మ‌డు. ప్ర‌గ్య దెబ్బ‌కు సముద్రుడే ఎర్ర‌బారిపోతున్నాడు. ఆకాశం వివ‌ర్ణ‌మ‌వుతోంది. అందుకు ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యం.

90 డిగ్రీల నుంచి 360 డిగ్రీల కోణంలో ప్ర‌గ్య జిమ్మింగ్ వీడియోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలాన్ని వేడెక్కించాయి.
వీటిలో మ‌చ్చుకు ఒక‌టి చూడాల‌నుకుంటే ఇదిగో.. అన్న‌ట్టు ఈ క‌ష్టం ఫ‌లించి అయినా ఎవ‌రైనా ఛాన్సులిస్తే బావుండేది పాపం.