వావ్..ఎక్సలెంట్ గా ఉందీ ట్రైలర్..చూడండి

తమిళ చిత్ర పరిశ్రమలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో శివ కార్తికేయన్‌. ఆయన తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘కనా’. మహిళా క్రికెటర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అరున్‌ రాజ కామరాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఐశ్వర్యా రాజేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ ట్రైలర్ చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

Kanaa - Official Trailer | Aishwarya Rajesh, Sathyaraj, Darshan | Arunraja Kamaraj | Sivakarthikeyan

ఒక గ్రామీణ మధ్య తరగతి అమ్మాయి ఆంతర్జాతీయ క్రికెటర్ గా ఎలా ఎదిగింది అన్నదే కథ. ఆ జర్నీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
ఈచిత్రంలో ఐశ్వర్య రాజేష్ లేడీ క్రికెటర్ పాత్రలో నటిస్తుండగా సత్యరాజ్ ఆమెకు తండ్రి గా కనిపించనున్నాడు. ఇప్పటివరకు మెన్స్ క్రికెట్ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి కానీ సౌత్ లో ఫస్ట్ టైం ఉమెన్స్ క్రికెట్ నేపథ్యం లో రానున్న ఈ చిత్రం ఈ డిసెంబర్ లో విడుదలకానుంది.