హవ్వా…శ్రీదేవి కూతురువి అయ్యుండి, ఇలాంటి డ్రస్ లోనా

 

(సూర్యం)

 

ఇదీ సోషల్ మీడియా వరస…ఏదో టీనేజ్ పిల్ల, అదీ కాక కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలెట్టిన హీరోయిన్ …కాస్త గ్లామర్ గా ఉండాలనుకోవటంలో తప్పేముంది. అయితే ప్రతీదీ బూతద్దంలోంచి చూసే జనం మాత్రం. …మీ అమ్మ….శ్రీదేవి..ఎంత పద్దతిగా ఉండేది…నువ్వేంటి ఇలా ఉంటున్నావు అంటూ తప్పు పట్టేస్తున్నారు. దాంతో పాపం జాహ్నవి కపూర్ కు కాస్తంత ఇబ్బందిగానే ఉంది.

 
 

తాజాగా ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా డ్రస్ వేసుకుని బయిటకు వచ్చింది. దాన్ని ఓ మీడియా కెమెరా ఓ ఫొటో తీసేసి వెబ్ మీడియాకు ఎక్కించేసింది. దాంతో ఇప్పుడు అంతా ఆ ఫొటో ని పెట్టి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇది గమనించిన జాహ్నవి అన్నగారు అదే అర్జున్ కపూర్ ..వార్నింగ్ రీతిలో ట్రోలర్స్ కు చురకలు అందించారు. అయినా మానితేనా. 

 

జాహ్నవి మాత్రం ఇది ఓ రకమైన గుర్తింపే..అయినా నా డ్రస్ లో తప్పేముందో నాకు అర్దం కావటం లేదు. నేనేదో పెద్ద తప్పు పని చేసినట్లు అందరూ వేలెత్తి చూపెడుతున్నారంటూ వాపోతోంది. అయితే ఆమె అమాయికంగా అలా అంటోదా..లేక తెలివిగా ఇలా కవర్ చేస్తోందో.