సమంతపై .. ‘జెర్సీ’హీరోయిన్ షాకింగ్ సెటైర్లు

శ్రద్ధ శ్రీనాథ్ గుర్తుందా..రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. వరస విజయాలతో దూసుకుపోతున్న ఆమె చేస్తున్న సినిమాలు వరసగా సక్సెస్ అవుతున్నాయి. తమిళంలో ఆమె తొలి సినిమా ‘విక్రమ్ వేద’, సొంత భాష కన్నడలో ఆమె నటించిన ‘యు టర్న్’పెద్ద హిట్స్. ఇక అసలు విషయానికి వస్తే ‘యు టర్న్’ సినిమాను తెలుగులో సమంతతో రీమేక్ చేసారు.

ఇక ఈ విషయం గురించి ‘జెర్సీ’ ప్రమోషన్ల సందర్భంగా తెలుగు ‘యు టర్న్’ చూశారా అని శ్రద్ధను అడిగితే ఆమె ఇచ్చిన సమధానం చూసి మీడియా వాళ్లు షాక్ అయ్యారు. తాను తెలుగు యుటర్న్ సినిమాను అరగంట చూసి ఆపేశానని.. తన పాత్రలో మరొకరిని చూడలేకపోయానని.. ఒరిజినల్లో తానే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాననుకుంటున్నానని కామెంట్ చేసింది. సమంత స్థాయి స్టార్ హీరోయిన్ గురించి ఇలా నెగెటివ్ గా మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఐతే శ్రద్ధ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన డోంట్ కేర్ యాటిట్యూడ్ ని కొనసాగిస్తూ మాట్లాడింది.

ఇదిలా ఉంటే…ఒక సినిమాలో శ్రద్ధ, సమంతనే రీప్లేస్ చేస్తోంది. సమంతకు గత ఏడాది వేసవిలో గుర్తుపెట్టుకునే మూడు విజయాలు దక్కాయి. అందులో ‘ఇరుంబు తిరై’(తెలుగులో అభిమన్యుడు) ఒకటి. విశాల్ హీరోగా పి.ఎస్.మిత్రన్ రూపొందించిన ఈ సైబర్ థ్రిల్లర్ తమిళ తెలుగు భాషల్లో సూపర్ హిట్టయింది. సమంతకు కూడా మంచి పేరు తెచ్చింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నారు. ఇందులో విశాల్ హీరోగా కొనసాగుతాడు కానీ.. హీరోయిన్ ను మాత్రం మార్చేస్తున్నారు. సమంత స్థానంలోకి శ్రద్ధ వస్తోంది. ఇప్పటికే అజిత్ తో కలిసి ‘పింక్’ రీమేక్ లాంటి క్రేజీ మూవీలో నటించే అవకాశం పట్టేసిన శ్రద్ధ.. ఇప్పుడు ‘ఇరుంబు తిరై’ రీమేక్ రూపంలో మరో మంచి ఛాన్స్ అందుకుంది.

ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్న మిత్రన్.. అది పూర్తయిన వెంటనే ‘ఇరుంబు తిరై-2’ను మొదలుపెడతారు.