‘ఇస్మార్ట్ శంకర్’ రెండో రోజు కలెక్షన్స్ లెక్కలివే!

‘ఇస్మార్ట్ శంకర్’ రెండో రోజు కలెక్షన్స్ లెక్కలివే!

పూరి హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజిలో ఇస్మార్ట్ శంకర్ పేలింది.వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించటం ట్రేడ్ కు షాక్ ఇస్తోంది. మొదటి రోజు ఆశ్చర్యకరంగా 7.83 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండవ రోజు కూడా ఎక్సపెక్టేషన్స్ మించిన వసూళ్లు సాధించింది.

రెండవరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 4.28కోట్ల వసూళ్లతో నిలకడగా ఉంది. ఈవారం విడుదలైన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం, వరస నాలుగు రోజులతో వీకెండ్ ఈ మూవీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ లు లాభాలలోకి ప్రవేశించారని సమాచారం. ఈ వారాంతం చివరికి ఇస్మార్ట్ శంకర్ 20కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉందని అంచనా.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇస్మార్ట్ శంకర్ రెండవ రోజు షేర్

నైజాం-రూ. 1.96 కోట్లు

సీడెడ్ _రూ. 0.7కోట్లు

ఉత్తరాంధ్ర -రూ.0.52కోట్లు

ఈస్ట్ -రూ.0.29కోట్లు

వెస్ట్ -రూ.0.21కోట్లు
కృష్ణ -0.25కోట్లు
గుంటూరు-0.24కోట్లు
నెల్లూరు-రూ.0.12కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు మొత్తం షేర్ రూ. 4.28కోట్లు

చాలా కాలంగా మార్కెట్లో స‌రైన మాస్ సినిమా లేక‌పోవ‌డంతో పూరి తీసిన ఈ ఊర‌మాస్ సినిమాకి అదుర్స్ అన్న రీతిలో క‌లెక్ష‌న్స్ ద‌క్కాయి. ఇస్మార్ట్ శంక‌ర్ ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత ఏ మేర‌కు నిల‌బ‌డుతాడు అనేది చూడాలి. ఐతే తొలి వీకెండ్ మాత్రం పూరికి ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన బెస్ట్ ఓపెనింగ్ కానుంది.