‘ఇస్మార్ట్ శంకర్’ ప్రి రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్)
పూరి జగన్నాధ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ రేపు( ఈ నెల 18న) వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ లలో …ఎన్నడూ చూడని మాస్ అవతారంలో రామ్ ని చూసి ఫ్యాన్స్ ఎక్సపెక్టేషన్స్ అంతకంతా పెంచేసుకుంటున్నారు.
మరో ప్రక్క తానేంటో సాలిడ్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన కసితో పూరి జగన్నాధ్ దీన్ని రూపొందించినట్టుగా చెప్తున్నారు. అంచనాలకు తగ్గట్టే బిజినెస్ కూడా భారీగా జరుగిందని ట్రేడ్ టాక్. ప్రపంచ వ్యాప్త థియోటర్ రైట్స్ ని 17 కోట్లకు ఇచ్చేసినట్లు చెప్తున్నారు. గుంటూరు, వెస్ట్ మినహా మిగిలిన ఏరియాలు అన్నీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా తీసుకున్నారు. సీడెడ్ రైట్స్ ఫైనాన్షియల్ లావాదేవీల్లో భాగంగా శోభన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అలా ఈ సినిమా యొక్క థియేట్రికల్ రైట్స్ మొత్తం ఆ విధంగా క్లోజ్ అయింది. ఇక ఓవర్సీస్ రైట్స్ గ్రేట్ ఇండియా ఫిలింస్ కు పంపిణీకి ఇచ్చారు. ఓవరాల్ గా నిర్మాత ఛార్మికి థియేట్రికల్ రైట్స్ రూపంలో టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు ఉంది.
ఇదిలా ఉండగా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఇస్మార్ట్ శంకర్ సుమారు 14 కోట్ల దాకా రాబట్టినట్టు తెలుస్తోంది. శాటిలైట్ ప్లస్ డిజిటల్ జీ సంస్థ స్వంతం చేసుకుంది. మరో ప్రక్క హిందీ డబ్బింగ్ హక్కులను రామ్ కెరీర్ లోనే అత్యధిక మొత్తానికి ఇచ్చేసినట్టు టాక్ ఉంది. ఇవన్నీ చూస్తూంటే మొత్తానికి రిలీజ్ కు ముందే ఇస్మార్ట్ శంకర్ రచ్చ చేస్తున్నాడు.
ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వైజ్ బ్రేకప్
ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ (కోట్లలో)
ఈస్ట్ 1.05 కోట్లు
వెస్ట్ 0.90 కోట్లు
ఉత్తరాంధ్ర 1.40 కోట్లు
గుంటూరు 1.10 కోట్లు
నైజాం 6.50 కోట్లు
సీడెడ్ 2.52 కోట్లు
కృష్ణా 0.95 కోట్లు
నెల్లూరు 0.48 కోట్లు
ఆంద్రా మరియు తెలంగాణా 14.90 కోట్లు
ఓవర్ సీస్ 0.90 కోట్లు
భారత్ లో మిగతా ప్రాంతాలు 1.20 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా… 17 కోట్లు