దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడంటే ఆ సినిమా మహా రాజ భోగం పట్టినట్లే. అయితే ఆయన అన్ని సినిమాలు రిలీజ్ చేసారు. ఆచి, తూచి అడుగులు వేస్తారు. సినిమాలో కంటెంట్, నిర్మాతలు చెప్తున్న రేటు, బయిట ప్రాజెక్టుకు ఉన్న క్రేజ్ వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. చిన్న సినిమాల విషయంలో కాస్త వెసులుబాటు చూపించి సాయిం చేసి,రిలీజ్ చేసినా, పెద్ద సినిమాల విషయంలో ఖచ్చితంగా ఉంటారని చెప్తారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్ ప్రపోజల్ ఆయన వద్ద ఉందిట.
పూరి జగన్నాథ్ కు గత కొంతకాలంగా హిట్ అనేది లేకపోవటం ఆయన తాజా చిత్రం బిజినెస్ పై ప్రభావం పడుతోంది. ఆంధ్రా, నైజాంలలో డిస్ట్రిబ్యూటర్స్ ని పట్టుకోవటం చాలా కష్టంగా మారినట్లు సమాచారం. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ అనగానే మొదట్లో క్రేజ్ వచ్చినా, ట్రైలర్ దాన్ని పాడు చేసిందని ట్రేడ్ లో వినపడుతోంది.
దానికి తోడు ఆంధ్రాకు పది కోట్లు డిమాండ్ చేస్తున్నారని , అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహం చూపించకపోవటంతో ఏడు కోట్లకు ఛార్మి తగ్గి ప్రపోజల్ పెడుతున్నట్లు సమాచారం. అయితే దిల్ రాజు తాను వరస ప్రాజెక్టులతో బిజిగా ఉన్నానని, రిలీజ్ చేయటం కష్టమని తేల్చి చెప్పిన్టలు సమాచారం. దాంతో ఏరియావైజ్ డిస్ట్రిబ్యూటర్స్ ని ఇస్మార్ట్ శంకర్ టీమ్ ఎంచుకుని అమ్మకాలు చేసే పనిలో ఉంది. అయితే ఛార్మి,పూరిలు ఊహించి,చెప్తున్న ఎమౌంట్ లు అయితే రావటం లేదని వినికిడి.