‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ డే కలెక్షన్స్! ( షేర్)

‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ డే కలెక్షన్స్! ( షేర్)

రామ్ పోతినేని హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రిలీజైన ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ ప్రేక్షకులను మెప్పించి మంచి టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తొలి రోజు అంద‌రి అంచ‌నాల‌ను మించి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుని ఆశ్చర్యపరుస్తోంది. చాలా కాలంగా మార్కెట్లో స‌రైన మాస్ సినిమా లేక‌పోవ‌డంతో పూరి తీసిన ఈ ఊర‌మాస్ సినిమాకి ఫ‌స్ట్‌డే అదుర్స్ అన్న రీతిలో క‌లెక్ష‌న్స్ ద‌క్కాయి. ఇస్మార్ట్ శంక‌ర్ ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత ఏ మేర‌కు నిల‌బ‌డుతాడు అనేది చూడాలి. ఐతే తొలి వీకెండ్ మాత్రం పూరికి ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన బెస్ట్ ఓపెనింగ్ కానుంది.

ఇక ఈ సినిమా తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.80 కోట్ల షేర్ ను వసూలు చేసింది. నైజాంలో సినిమాకు మంచి ఆదరణ లభించగా, రూ. 3.43 కోట్లు కలెక్షన్లు నమోదయ్యాయి. ఇక సీడెడ్ లో రూ. 1.20 కోట్లు, వైజాగ్ రూ. 86 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 50 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, కృష్ణాలో రూ. 53 లక్షలు, గుంటూరులో రూ. 57 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలు వసూలయ్యాయని పీఆర్వో బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.