భాయ్‌లా కింగ్ నాగార్జున ఫామ్ హౌస్‌కి వెళ్ల‌రా?

                                    బిగ్ బాస్ కొత్త సీజ‌న్.. ఏం జ‌రుగుతోంది?

బిగ్ బాస్ తెలుగు ఈపాటికే ప్రారంభం కావాల్సిన‌ది ఆగస్టుకి వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం ఇంటి స‌భ్యుల‌ సెలెక్ష‌న్స్ ప్రాసెస్ జ‌రుగుతోంది. మ‌రోవైపు హిందీ బిగ్ బాస్ 14 వ సీజన్ త్వరలో ప్రారంభమవుతుంద‌ని స‌మాచారం. తెలుగు బిగ్ బాస్ కి నాగార్జున హోస్టింగ్ చేస్తుండ‌గా.. హిందీ బిగ్ బాస్ కి స‌ల్మాన్ హోస్ట్ గా కొన‌సాగనున్నారు.

ఇదొక్క‌టే కాదు ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ కార‌ణంగా బిగ్ బాస్ ని కొన‌సాగించాలా వ‌ద్దా? అన్న‌దానిపై స్టార్ మా వాళ్ల‌లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌న్న క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇదిలా ఉండ‌గానే అటు హిందీ బిగ్ బాస్ కి సంబంధించిన సెట్లు వేస్తుండ‌డం చూస్తుంటే ఇక బ్రేక్ ఉండ‌ద‌నే అర్థ‌మ‌వుతోంది.  ఇప్ప‌టికే పోటీదారుల్ని ఎంపిక చేసి ప్రతి సంవత్సరం మాదిరిగా సల్మాన్ ఖాన్ హోస్టింగ్ కోసం ప్రిపేర‌వుతున్నాడ‌ట‌.ఈసారి కరోనా లాక్‌డౌన్ కారణంగా స్టార్ హీరో తన ఫామ్‌హౌస్ నుండి కొత్త సీజ‌న్ ని ఆప‌రేట్ చేస్తున్నారు.

ముంబై పన్వెల్ లో కొన్ని ఎక‌రాల్లో ఉన్న భాయ్ తోట‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భాయ్ కోసం ప్రత్యేక సెట్ నిర్మిస్తున్నారు. వివియన్ డిసేనా, జే సోని, సాహిల్ ఖాన్, మిషాల్ రహేజా, శుభంగి అట్రే, షిరీన్మీర్జా ఈ సంవత్సరం హిందీ సీజ‌న్ ని వేడెక్కించ‌బోతున్నారు. ఇక ప‌న్వేల్ ఫామ్ హౌస్ లో గ‌త నాలుగు నెల‌లుగా స‌ల్మాన్ భాయ్ వ్య‌వ‌సాయం చేస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ సెట్ ని అక్క‌డికే ర‌ప్పించుకుంటున్నాడు. మ‌రి ఇలాంటి ఆలోచ‌నే ఇక్క‌డ తెలుగు వెర్ష‌న్ హోస్ట్ నాగార్జున కూడా చేస్తున్నారా? అస‌లే మ‌హ‌మ్మారీ హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఒణికిస్తోంది క‌దా? అంటే.. అలాంటిదేమీ లేదు. అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో గ‌తంలో బిగ్ బాస్ సెట్స్ వేశారు. ఇప్పుడు కూడా అక్క‌డే కంటిన్యూ అవుతుంద‌ట‌.

అయితే అన్న‌పూర్ణ స్టూడియోస్.. ఏడెక‌రాల ప‌రిస‌రాల్లోనే ఉన్న యూసఫ్ గూడ‌- ఇందిరాన‌గ‌ర్ ఏరియాల్లో వంద‌లాది పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌డం ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఆ ఏరియాల్లో సినిమావాళ్లు గ‌జ‌గ‌జ ఒణికిపోతుండ‌డంపైనా నిరంత‌రం ఏవో క‌థ‌నాలు మీడియాలో వ‌స్తూనే ఉన్నాయి.