ప్ర‌స్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు కొర‌టాల‌. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి – రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ముగ్గురు క‌థానాయిక‌ల్ని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండ‌గానే అటువైపు అల్లు కాంపౌండ్ లో బ‌న్నితో అనూహ్యంగా సినిమాని ప్ర‌క‌టించారు కొర‌టాల‌.

ఇది మెగా కాంపౌండ్ కి ఓకేనా? అంటే నాట్ ఓకే అంటూ ఒక సెక్ష‌న్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రైవ‌ల్ కాంపౌండ్ హీరోతో అందునా కాంపిటీట‌ర్ తో సినిమా చేయ‌డ‌మేమిటి? అంటూ గుస్సా న‌డుస్తోంద‌ట‌. నిజానికి మేమంతా ఒక‌టే అంటూ మెగా – అల్లు కాంపౌండ్లు ప్ర‌తిసారీ ఏదో ఒక ప్ర‌క‌ట‌న గుంబ‌న‌గా చేస్తూనే ఉన్నా.. లోలోన పోటీ మాత్రం య‌థాత‌థంగానే ఉంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీత‌త్వం ఉంది. ఆ ఇద్ద‌రూ ఇండ‌స్ట్రీ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టేందుకు నువ్వా నేనా? అంటూ పోటీప‌డేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు. పైగా చెర్రీ తాను చేయాల్సిన సినిమాని బ‌న్ని త‌న్నుకుపోయాడ‌ట‌. డేట్స్ స‌మ‌స్య‌తో చెర్రీ కాద‌నుకుంటే కొర‌టాల బ‌న్ని వ‌ద్ద‌కు వెళ్లాడ‌ని తెలిసింది. కానీ ఇంత‌లోనే కొర‌టాల ఇలా ప్ర‌క‌టించేస్తాడ‌ని చెర్రీ ఊహించ‌లేదు. అందుకే అత‌డిపై సీరియ‌స్ గానే ఉన్నాడ‌ట‌.

అలాంటి పోటీ ఉన్న చోట ఉన్న‌ట్టుండి కొర‌టాల ఇలా చేస్తాడా? అంటూ మెగా ప్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక బ‌న్నితో కొర‌టాల మూవీపై చెర్రీ కాస్త వ‌ర్రీగానే ఉన్నాడు! అంటూ ఓ సెక్ష‌న్ సోష‌ల్ మీడియా ప్ర‌చారం చేస్తోంది. మెగా వ‌ర్సెస్ అల్లు వార్ ఎప్ప‌టికీ అంతం లేనిది. పోటీ ఎప్పుడూ ఉంటుంది. ఫ్యాన్స్ లోనూ అత్యుత్సాహం అలానే ఉంది. దీనిని ఆరోగ్య‌క‌ర పోటీగా చూస్తే మంచిదే. కానీ ఇలా ఒక‌రికొక‌రు పోటీ అంటూ ప్ర‌చారం చేయ‌డం స‌రికాదేమో! అన్న వాద‌నా వినిపిస్తోంది.