ఇన్సైడ్ టాక్ : “NBK 107” నుంచి దసరా కానుకగా వచ్చే అప్డేట్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ మాస్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే రీసెంట్ గా బాలయ్య హీరోగా నటించిన “అఖండ” తో మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర తాను ట్రాక్ లో పడగా తర్వాత సినిమాలకు భారీ అంచనాలు తాను సెట్ చేసుకున్నాడు.

అయితే ఈ చిత్రాల్లో తన కెరీర్ లో చేస్తున్న 107వ సినిమా ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. మరి దీనిపై మాస్ లో భారీ అంచనాలు కూడా ఇప్పుడు ఉన్నాయి.

అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఓ క్రేజీ సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా నుంచి అయితే ఈ అక్టోబర్ లో రాబోతున్న దసరా మహోత్సవం సందర్భంగా సినిమా కథకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ ని అందించబోతున్నారని గట్టి సమాచారం.

దీనితో అయితే ఈ దసరాకి బాలయ్య అభిమానులకి నందమూరి ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఉండడం ఖాయం అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో అయితే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.