ఇన్సైడ్ టాక్ : బాలయ్య హుకుం..షూట్ విషయంలో నిజంగానే ఆ మాట అన్నాడా.?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ చుట్టూతా ఉండే ఆరా వేరే లెవెల్లో ఉంటుంది. తన వరకు గాని సరైన సినిమా పడితే దాని మేనియా ఎలా ఉంటుందో తన లాస్ట్ భారీ హిట్ చిత్రం “అఖండ” తో చూపించారు. మరి ఈ చిత్రం కిక్ తో మరింత అదిరే సినిమాలు తాను టేకప్ చేసి అదరగొట్టారు.

అయితే ఇప్పుడు తన కెరీర్ లో 107వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. దీనితో ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఆల్రెడీ చాలా వరకు షూటింగ్ కూడా అయ్యిపోయింది. కానీ రీసెంట్ గా టాలీవుడ్ మండలి సినిమా షూటింగ్స్ ని నిలపాలని సూచించిన సంగతి తెలిసిందే.

మరి ఈ విషయంలో బాలయ్య పలు సంచలన కామెంట్స్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్ బయటకి వచ్చింది. బాలయ్య షూటింగ్ విషయంలో సీరియస్ అయ్యారని షూటింగ్ మొదలు పెట్టండి ఎవడు ఆపుతాడో నేను చూస్తా అని హుకుం జారీ చేసినట్టుగా షాకింగ్ టాక్ బయటకి వచ్చి ఇప్పుడు వైరల్ అవుతుంది.

దీనితో ఇదే బాలయ్య ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అలాగే కొందరు అయితే బాలయ్య నిజంగా ఈ కామెంట్ చేసే ఉంటారని కూడా అంటున్నారు. మొత్తానికి అయితే షూటింగ్స్ విషయంలో బాలయ్య సంతృప్తిగా లేరని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.