వాళ్లు మగతనం లేనివారే: ఇళయరాజా

విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లోనూ రీమేక్‌ అవుతోంది. ఈ నేపధ్యంలో 96 చిత్రంలో ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాత చిత్రాల్లోని పాటలను పొందుపరిచారు.

అలాగే రీసెంట్ గా తెరపైకి వచ్చిన మెహందీ సర్కస్‌ చిత్రంలోనూ ఇళయరాజా పాత పాటలను వాడారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఇళయరాజా ఇటీవల ఒక చర్చా వేదికలో ఈ విషయాలను ప్రస్దావిస్తూ …తాను సంగీతాన్ని సమకూర్చిన పాటలను కొత్త చిత్రాల్లో వాడుకున్న వాళ్లు మగతనం లేనివారే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇళయరాజా వ్యాఖ్యలకు 96 చిత్రం టీమ్ గట్టిగానే బదులిచ్చింది. తమ చిత్రంలో వాడిని ప్రతి పాటకు రాయల్టీ చెల్లించినట్లు వారు తెలిపారు. మరో ఇళయరాజా పద్దతిని నెటిజన్లు మాత్రం ఎండగడుతున్నారు. ఇళయరాజా తన సంకుచిత మనస్తత్వాన్ని వీడాలని.. ఆయన ఇంతకు ముందు చాలా చిత్రాల్లో పాత చిత్రాల్లోని పాటలను వాడుకున్న సందర్భాలు ఉన్నాయని, అప్పుడు ఆయన మగతనం లేనివాడా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఏఆర్‌.రెహ్మాన్‌కు ఇళయరాజాకు మధ్య ఉన్న తేడా ఇదేనని విమర్శలు గుప్పిస్తున్నారు.