‘రంగస్థలం’ లో మొదట ఆప్షన్ సమంత కాదు..మరి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సమంత కాంబినేషన్‌లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనకి తెలిసిందే. ఫస్ట్ డే ..ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. అదే విధంగా భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ చిత్రంలో చరణ్ ఎంత ఫెరఫార్మ్ చేసారో, అతనికి పోటీగా సమంత అదే స్దాయిలో అదరకొట్టింది. సమంత ఆ పాత్రకు ఫెరఫెక్ట్ అని, ఆమె కోసమే ఆ పాత్ర రాసినట్లుందని చెప్పుకున్నారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే…ఆ పాత్ర కోసం మొదట అడిగింది సమంతను కాదట. మరెవరు అంటే…
పక్కా పల్లెటూరి యువతి రామలక్ష్మి పాత్రలో సమంత అద్భుతంగా నటించి ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఆ పాత్ర కోసం ముందుగా అనుపమా పరమేశ్వరన్‌ను అనుకున్నారు. అయితే ఆమె అప్పటికే వేరే కమిట్మెంట్ తో బిజీగా ఉండటంతో సమంతను తీసుకున్నారు. ఆ సినిమా ఆఫర్ కోల్పోవడం గురించి తాజాగా అనుపమ మాట్లాడింది.
అనుపమ మాట్లాడుతూ…`రామ్‌చరణ్ `రంగస్థలం` మిస్సయినందుకు చాలా బాధగా ఉంటుంది. అది చాలా మంచి సినిమా. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం నాకే వచ్చింది. డేట్లు కుదరకపోవడం వల్ల చేయలేకపోయా. అయితే సినిమా చూసిన తర్వాత మాత్రం నేను చేయడం కంటే సమంత చేయడమే మంచిదనిపించింది. రామలక్ష్మి పాత్రలో సమంత అద్భుతంగా నటించార`ని అనుపమ చెప్పింది.