హాట్ టాపిక్ : హైపర్ ఆదికి ఇద్దరు భార్యలు!

Hyper Aadhi Got Marriage

 

బుల్లితెరపై ఫేమస్ అయిన కొందరు సెలెబ్రిటీల పెళ్లిళ్లపై ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ పెళ్లి విషయమైతే ఎప్పటి నుంచో నానుతూ వస్తోన్న వ్యవహారం. ఇక ఆ తదుపరి జాబితాలో సుధీర్, హైపర ఆది, రష్మీ వంటివారుంటారు. రష్మీ-సుధీర్ మధ్య ఏదో ఉందని ఎన్నో యేళ్ల నుంచి వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే తామిద్దరం కేవలం స్నేహితులమేనని ఎన్నో సార్లు పెళ్లి వార్తలను ఖండించారు రష్మీ సుధీర్. ఇక హైపర్ ఆది విషయానికొస్తే అతని పెళ్లిపై అప్పట్లో నానా రచ్చ జరిగింది.

Hyper Aadhi Got Marriage

ఢీ షోలో ఎంటరైన హైపర్ ఆది వర్షిణితో చేసే రొమాన్స్‌ ఓ రేంజ్‌లో క్లిక్కయింది. ఇక వీరిద్దరు ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతోన్నారు లెక్కలేనన్ని వార్తలు రూమర్లు వ్యాపించాయి. ఇలా బుల్లితెర స్టార్ల పెళ్లి విషయం నిత్యం హాట్ టాపిక్‌గానే ఉంటుంది. అయితే హైపర్ ఆది ఈ మధ్య ఓ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. సాయి కుమార్ హోస్ట్‌గా వస్తోన్న వావ్ 3లో హైపర్ ఆది వచ్చాడు. రాబోయే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో హైపర్ ఆది పెళ్లిపై జరిగిన టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

రోహిణి, హిమజ, ఆది, అభి షోలో పాల్గొన్నారు. షో మధ్యలోనే హైపర్ ఆదికి సాయి కుమార్ పెళ్లి చేసినట్టు తెలుస్తోంది. అది కూడా ఒక్కరిని కాదు ఇద్దర్నీ. ఆటలో భాగంగా హైపర్ ఆది థర్మకోల్ బెలూన్స్ ఉండే చోట పడతాడు. ఇక ఇలానే ఓ అమ్మాయిని ఇస్తే ఇక్కడే వీటినే తలంబ్రాలుగా పోసి పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లిపోతానని కామెంట్ చేస్తాడు. అనుకున్నదే తడువుగా.. అక్కడే ఉన్న హిమజ, రోహిణి ఇద్దరూ వస్తారు. వారిద్దరూ నాకంటే నాకు కావాలని హైపర్ ఆదిని లాగుతుంటారు.

మధ్యలో సాయి కుమార్ ఎంట్రీ ఇచ్చి.. హేయ్ మీ అమ్మగారు నాన్నగారు బ్రహ్మాండంగా నీ పెళ్లి చేయాలనుకుంటున్నారు.. నువ్ ఇలా ఆవేశ పడితే ఎలాగా? అని కామెంట్ చేయగా.. ఏదో తొందర పాటు.. అని ఆది సెటైర్ వేశాడు. ‘పెళ్లైన తరువాత కూడా పర్మిషన్ లేకుండా అటు తిరుగుతారేంటి నన్ను అడగాలి కదా’ అంటూ రోహిణిని ఉద్దేశించి ఆది కామెంట్ చేశాడు. ‘నువ్ ఇద్దరినీ చేసుకున్నావ్ కదా మాకు ఇద్దరు కావాలి కదా.. అందుకే ఇంకొకరు’ అని రోహిణి అనడంతో అందరూ షాక్ అయ్యారు. ‘ఏంటండి ఇది’అని ఆది అవాక్కవ్వగా.. నేనేమీ వినలేదు.. చూడలేదు.. అని సాయి కుమార్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రోగ్రాం చివర్లో గిఫ్ట్ హాంపర్స్ ఇస్తుండగా.. ‘సాయి కుమార్ గారికి థ్యాంక్స్.. పెళ్లి చేయడమే కాదు అగరబత్తిలను కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు’ అని లాస్ట్ పంచ్ వేశాడు. మొత్తానికి ఇలా హైపర్ ఆది షో మొత్తం సందడి చేసినట్టు కనిపిస్తోంది. ఇక పూర్తి షో చూడాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.