బోయపాటి శ్రీను గత కొంతకాలంగా హైదరాబాద్ ని వదిలి అమరావతిలో బిజిగా ఉన్నారు. తనను మొదటి నుంచి నమ్మిన తెలుగుదేశం పార్టీ కోసం యాడ్స్ షూట్ చేసారు. తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఆయన చేసిన యాడ్స్ కాన్సెప్ట్ బాగా వర్కవు అయ్యింది. ఈ మేరకు బోయపాటి కు మంచి రెమ్యునేషన్ సైతం ముట్టింది. అంత పెద్ద డైరక్టర్ కదా ఎంత తీసుకుని ఉంటాడు..యాడ్స్ నిమిత్తం అనేది అంతటా చర్చనీయాంశం అయ్యింది.
మీడియా సర్కిల్స్ నుంచి వినపడుతున్న దాని ప్రకారం ఈ ప్రకటనల నిమిత్తం బోయపాటి అందుకున్న మొత్తం 5 కోట్లు! ఈ యాడ్స్ తయారికీ బోయపాటికి పట్టిన సమయం నెలన్నరే. అయినా మంచి రెమ్యునేషన్ అందుకున్నారన్నమాట.
అంతేకాదు పార్టి అధికారంలోకి మరోసారి వస్తే బోయపాటికు ప్రత్యేకమై పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో పుష్కరాలకు సంబంధించిన యాడ్‌లు కూడా బోయపాటి చేసిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే, రాంచరణ్‌తో రూపొందించిన ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని బాలకృష్ణను డైరెక్ట్ చెయ్యడానికి సిద్ధమవుతున్నారు బోయపాటి.