సంక్రాంతి పందెంలో నువ్వా నేనా? అన్న పోరు సాగుతోంది. నాలుగు సినిమాలు రిలీజైతే అగ్ర హీరోల సినిమాలు కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్ వైపు వెళుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి పందెంలో మహేష్ 100 కోట్ల షేర్ తెస్తాడా లేదా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. తొలి మూడు రోజుల్లో సరిలేరు నీకెవ్వరు 50 కోట్ల షేర్ వసూలు చేసింది. సంక్రాంతి సెలవుల్ని కలుపుకుని లాంగ్ రన్ లో మరో 50 కోట్లు వసూలు చేస్తే పంపిణీదారులు సేఫ్ అయినట్టేనని విశ్లేషిస్తున్నారు.
`సరిలేరు నీకెవ్వరు` ట్రాక్ పరిశీలిస్తే .. ఈ సినిమా మొదటి రోజు 32.64 కోట్ల షేర్ మార్క్ తో అల్ టైం నాల్గవ స్థానంలో నిలిచింది. రెండవరోజు 9.5 కోట్ల షేర్ ను.. మూడవ రోజు 7.21 కోట్ల షేర్ ను సాధించి 50 కోట్ల షేర్ మార్క్ కి చేరువైంది. అలాగే నాలుగో రోజు 9 కోట్ల షేర్ రాబట్టుకొని 4 రోజుల్లో 58.3 కోట్ల షేర్ ని సాధించింది. భోగి నాటికి 58 కోట్లు.. అంటే సంక్రాంతి- కనుమ పండుగల వసూళ్లు కలుపుకుంటే స్పీడ్ బాగానే ఉండనుందని అర్థమవుతోంది. సరిలేరు నీకెవ్వరు ఏపీ-తెలంగాణ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే… నైజాం- 19.04 కోట్లు.. సీడెడ్- 7.99 కోట్లు.. గుంటూరు- 6.7 కోట్లు.. ఉత్తరాంధ్ర- 8.02 కోట్లు.. తూర్పు గోదావరి- 5.35 కోట్లు.. పశ్చిమ గోదావరి- 4.05 కోట్లు..కృష్ణా- 5.01 కోట్లు.. నెల్లూరు- 2.14 కోట్లు వసూలైంది. ఓవరాల్ గా 60 కోట్లకు చేరువైంది.