రామచరణ్ ఇంటర్వ్యూ హైలైట్స్

మా నాన్న న‌న్ను చూసి ఈర్ష్య‌ప‌డ్డాన‌ని అప్పుడు చెప్పారు- రామ్ చ‌ర‌ణ్‌

`సైరా న‌ర‌సింహారెడ్డి` టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లో జ‌రిగింది. చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి, రామ్‌చ‌ర‌ణ్ త‌ల్లి సురేఖ క‌లిసి సైరా న‌ర‌సింహారెడ్డి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ రూపొందిస్తోన్న సినిమా ఇది. రామ్‌చ‌ర‌ణ్ నిర్మా. సురేఖ కొణిదెల స‌మ‌ర్పిస్తున్నారు. చిరంజీవి క‌థానాయ‌కుడు. ఈ సినిమా విశేషాల గురించి రామ్‌చ‌ర‌ణ్ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు… 

 

* సురేంద‌ర్ రెడ్డితో ఇలాంటి సినిమాను చేయాల‌ని ఎందుకు అనిపించింది? 

–  డైర‌క్ట‌ర్ అయినా,  యాక్ట‌ర్ అయినా అన్నీ చేయాలి. అన్ని ర‌కాల పాత్ర‌ల‌ను హ్యాండిల్ చేయ‌గ‌ల‌గాలి. అప్పుడే వారి స్టామినా తెలుస్తుంది. నేను సురేంద‌ర్ రెడ్డికి ఆఫ‌ర్ ఇచ్చానంతే. ఆయ‌నే ఈ సినిమాను చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. నేను ఆయ‌న్ని న‌మ్మ‌కం కాదు. ఆయ‌న్ని ఆయ‌న  న‌మ్మ‌కుని ఈ సినిమా చేస్తున్నారు. 

 

* సినిమాను  ఎప్పుడు విడుద‌ల చేస్తారు? 

– వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో. స‌మ్మ‌ర్‌లో ఫ‌స్టాఫా.. సెకండాఫా.. అనేది మేం చెప్తాం. ఇంకా డేట్ అనుకోలేదు.

 

* ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారు?

–  బడ్జెట్‌ని ఇప్పుడే చెప్ప‌ద‌ల‌చుకోవ‌డం లేదు. భారీగానే తీస్తున్నాం. డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబ‌ట్టి వెనకా ముందూ చూడ‌కుండా, దేనికీ వెన‌కాడ‌కుండా తీస్తున్నాం. ఎక్కువ‌గానే పెట్టి చేస్తున్నాం. నాకైతే ప్రాఫిట్స్ వ‌స్తే బోన‌స్. రాక‌పోయినా ఆనంద‌మే.

 

* మ‌గ‌ధీర‌లాంటి సినిమాను చేయాల‌ని మీతో ఒక‌సారి మీ నాన్న చెప్పార‌ట క‌దా?

–  నాన్న‌గారు నాతో ఒక‌సారి అన్నారు.. “చూడు చ‌ర‌ణ్‌… నీ మీద నాకు ఏదైనా ఈర్ష్యో, జెల‌సీ ఉందంటే అది `మ‌గ‌ధీర‌` మాత్ర‌మే.  నువ్వు రెండో సినిమాకే సోషియో ఫాంట‌సీ కాస్ట్యూమ్  డ్రామా చేసేశావ్‌. నేను 35ఏళ్లు.. 150 మూవీస్ చేశాను. నాకు ఇప్ప‌టిదాకా ఒక్క కాస్ట్యూమ్ డ్రామా రాలేదు అని అన్నారు. దానికి స‌మాధాన‌మే ఈ సినిమా. కాబ‌ట్టి ఖ‌ర్చును, మ‌రోదాన్ని దృష్టిలో పెట్టుకోకుండా చేస్తున్నాం.

 

*  ఎన్ని భాష‌ల్లో ప్లాన్ చేస్తున్నారు?

–  ప్ర‌స్తుతం ఆల్ సౌత్ ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లో స్ట్రెయిట్ రిలీజ్ చేస్తున్నాం.

 

* ఈ సినిమాను నిర్మించ‌డం మీకు ఎలా ఉంది? 

– ప్రౌడ్ ఫీలింగ్. ప్రెస్టీజియ‌స్ ఫీలింగ్ ఉంది.  

 

* చిరంజీవి టీజ‌ర్ రిలీజ్‌కి ఎందుకు రాలేదు? 

–  నా బ‌ర్త్ డే టీజ‌ర్ చూడండి అని ఆయ‌నే వ‌చ్చి కూర్చోవ‌డం బావుండ‌దు క‌దండీ. ఓ టీమ్‌గా మేం ఇదంతా చేసి, ఆయ‌న‌కు చూపిస్తేనే బావుంటుంద‌ని ఇలా ప్లాన్ చేశా. 

 

* థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని ఎందుకు విడుద‌ల చేయ‌లేదు? – 

ట‌్రైల‌ర్‌ని విడుద‌ల చేయాల‌నే అనుకున్నా. కానీ ఇందులో కొన్ని జంతువులున్నాయి. యానిమ‌ల్ వెల్ఫేర్ బోర్డుకి ప‌ర్మిష‌న్‌కి లెట‌ర్ పెట్ట‌డంలో డిలే అయింది. 20 రోజులు ముందే పెట్టాల‌న్న విష‌యం తెలియ‌లేదు. అందువ‌ల్ల డిలే అయింది.  సెన్సార్‌కి కూడా పంపిస్తున్నాం. ఇంకో రెండు వారాల్లో థియేట‌ర్ల‌లో ఏ సినిమాలు ఆడుతున్నా స‌రే.. వాటితో పాటు ప్ర‌ద‌ర్శిస్తాం.

 

* సైరా టీజ‌ర్‌లో చివ‌ర‌గా చూస్తే కొద‌మ‌సింహంలో ఆయ‌న ఉన్న ప‌వ‌ర్‌క‌నిపించింద‌. మీకు ఆ థాట్ ఎలా వ‌చ్చింది?

– దాన్ని  లీ,  డైర‌క్ట‌ర్‌గారు డిజైన్ చేశారు. నాక్కూడా ఫేవ‌రే్ట్ సినిమా కొద‌మ‌సింహం. ఆ సినిమా చూసే నేను గుర్ర‌పు స్వారీ నేర్చుకున్నా.