* ఈ మధ్య మీ నిశ్చితార్థం రద్దవుతుందంటూ వచ్చిన వార్తల్ని చూసి ఏమనిపించింది?
– వ్వాట్ అనుకున్నా. జస్ట్ వ్యంగ్యంగా నవ్వుకున్నా. అంతకన్నా అలాంటి వార్తలకు అసలు విలువ లేదు. ఎందుకంటే నాకూ, రక్షిత్‌కి ఒకరంటే ఒకరం ఏంటో బాగా తెలుసు. అందుకే జస్ట్ నవ్వి ఊరుకున్నా.
* ఇంతకీ పెళ్లెప్పుడు?
– నాకెలా తెలుస్తుంది? ఏమో ఇంకా ఏమీ అనుకోలేదు
* నిశ్చితార్థమై అప్పుడే ఏణ్ణర్ధం అవుతున్నట్టుంది. ఇంకా పెళ్లి గురించి ఏమీ అనుకోలేదా?
– లేదండీ. అప్పుడు రెండున్నరేళ్ల తర్వాత వివాహం చేసుకుందాం అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మా ఇద్దరి ప్రొఫెషన్స్ చాలా వేగంగా ఉన్నాయి. అందుకే పెళ్లి ఎప్పుడు ఉంటుందో సరిగా చెప్పలేకపోతున్నాను.
* మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం వల్లనే అందరికీ మీ నిశ్చితార్థం రద్దయిందని డౌట్ వస్తుందేమో?
– నా మాటలకూ దానికీ ఏంటి సంబంధం. అయినా పెళ్లి నా చేతుల్లో లేదు. పెద్దలు నిర్ణయించాలి.
* మీ డ్రీమ్ ప్రాజెక్ట్ లు ఏమైనా ఉన్నాయా?
– ఇన్నొసెంట్ ఫేస్‌తో విల్లీగా నటించాలని ఉంది. అలాగే పీరియాడికల్ సినిమాలో చేయాలని ఉంది.