న‌టి ప‌బ్ బిజినెస్ పై క‌రోనా పంచ్

నటనతో పాటు అనేక మంది నటులు వేర్వేరు వ్యాపారాలలోకి ప్రవేశించారు. వారిలో కన్నడ అందం ప్రణీత సుభాష్ ఒకరు. ఈ అందాల క‌థానాయిక 2015 లో బెంగుళూరులో `బూట్లెగర్` అనే పబ్ ను ప్రారంభించింది. తాజా స‌మాచారం ప్రకారం.. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు పబ్ వ్యాపారం నుండి తప్పుకుంది. అయితే అందుకు కార‌ణ‌మేమిటి? అంటే.. ప్ర‌స్తుతం ఇతర లాభ‌సాటి వ్యాపార అవకాశాల కోసం వెతుకుతోందిట‌.

అయితే ప‌బ్ బిజినెస్ పై క‌రోనా పంచ్ ప‌డిందా? అంటూ యూత్ లో ఒక‌టే చ‌ర్చ సాగుతోంది. మరోవైపు సంక్షోభ సమయంలో కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటోంది. త‌నే స్వ‌యంగా ఆహారాన్ని తయారు చేసి… అవ‌స‌రార్థులంద‌రికీ స్వయంగా ప్యాక్ చేసి అందిస్తోంది. అంతే కాదు ఆమె కూడా ముందుకు వచ్చి డైలీ వేతన సినీ కార్మికులకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది. ప్ర‌ణీత ప్ర‌స్తుతం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు దూర‌మైనా క‌న్న‌డ‌లో బిజీగానే ఉంది.