పెళ్లాడే మ‌న‌సున్నా బ‌య‌ట‌పెట్టలే‌ని ఐటెమ్ గ‌ర్ల్!

ఒక్క రాత్రి..కోటి ఆదాయం!

తాను ప్రేమించిన యువ‌హీరోని పెళ్లాడాల‌ని క‌ల‌లు గంటోంది ఆ ఐటెమ్ గాళ్. కానీ మాయ‌దారి సొసైటీ ఏమంటుందో! అందుకే లోలోన మ‌ద‌న‌ప‌డుతోంది. బ‌య‌టి ప్ర‌పంచం సూటి పోటి మాట‌లతో వేగేదెలా? అందుకేనేమో కాస్త భ‌య‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. పైగా 17ఏళ్ల వ‌య‌సు వ‌చ్చిన కొడుకు ఉన్నాడు. అత‌డి ముందు రెండో పెళ్లి అంటే కాస్త ఆలోచిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

కార‌ణం ఏదైనా మ‌న‌సులోనే త‌న కోరిక‌ను అణ‌చి పెట్టుకుంది. ఇక గ‌త ఏడాది కాలంగా త‌న విడాకుల‌కు సంబంధించిన క‌థ‌నాల‌తో మీడియా షంటేయ‌డంపైనా ఎంతో క‌ల‌త‌గా ఉందిట‌. పెళ్లాడిన నిర్మాత కం న‌టుడితో దాదాపు 19 ఏళ్ల పాటు సంసారం సాగించాక‌.. యువ‌హీరోతో ఎఫైర్ వ‌ల్ల కాపురంలో క‌ల‌త‌లు చెల‌రేగాయి. అనంత‌రం విడాకులు తీసుకుని ఎవరి దారిలో వాళ్లు వెళ్లారు. ఒక‌రికొక‌రు పార్ట్ న‌ర్స్ ని వెతుక్కున్నారు. ఇక అతగాడు ప‌బ్లిగ్గానే ఫియాన్సీతో తిరిగేస్తున్నాడు. అత‌డి కంటే ఓ మెట్టు పైనే ఉంటా! అనే రేంజులో తాను ప్రేమించిన యువ‌హీరోతో ఆవిడ గారు అంతే ప‌బ్లిగ్గా తిరిగేస్తున్నారు. దీనిపై నెటిజ‌నుల్లో అన్నీ ఇన్నీ జోకులు కావు. ఇక ఇంత ప‌బ్లిక్ అయిపోయాక కూడా ఇంకా ఆ హీరోతో పెళ్లి అంటే మాత్రం త‌డ‌బ‌డుతోంది. అయితే త‌న‌కు పెళ్లి చేసుకునే ఉద్ధేశం లేదా? అంటే ఎందుకు లేదు. చుట్టూ జ‌నం ఏమ‌నుకుంటారోన‌న్న కంగారులో అస‌లు బ‌య‌ట‌ప‌డ‌డం లేదు. అయితే ఇటీవ‌లే ఓ బుల్లితెర షోలో హోస్ట్ ముందు అన్నిటినీ బ‌య‌ట పెట్టేసింది. త‌న‌కు బీచ్ లో వైట్ వెడ్డింగ్ అంటే ఇష్ట‌మ‌ని ఓపెనైపోయింది. అది కూడా వ‌ధువును ముత్త‌యిదువులు అలంక‌రించి బీచ్ కి తీసుకొచ్చి మూడు ముళ్లు వేయించే ప్ర‌క్రియ అంటే ఇంకా ఇంకా మోజు అని కూడా ఓపెన‌ప్ అయిపోయింది. ఆ ముత్త‌యిదువులు అంతా త‌న గ‌ర్ల్స్ గ్యాంగ్ వాళ్లే అయితే ఇంకా బావుంటుంద‌ని సెల‌విచ్చింది. మొత్తానికి స‌ద‌రు ఐటెమ్ గాళ్ మ‌న‌సులో మాట‌ను దాచ‌లేక‌పోయింది. ఇన్నాళ్లు మీడియా వెంట‌ప‌డుతూ పెళ్లెప్పుడు? అని అడిగేసినా అబ్బే ఇప్పుడు దాని గురించి ఎందుకులే .. సోలోగానే ఉంటా.. జంట షికార్లు చేస్తా! అనేసిన స‌ద‌రు అమ్మ‌డిలో లోన మ‌రీ ఇంత‌గా మ‌రిగిపోతోందా? అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు మ‌రి!