అభిమానుల్ని హర్ట్ చేసిన విజయ్ దేవరకొండ

(ధ్యాన్)
 
ఇప్పుడు యూత్‌లోక్రేజీ హీరోగా పేరున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, బుధవారం రిలీజైన `గీత గోవిందం`తో పెద్ద స‌క్సెస్‌ కొట్టాడు. ఇది త‌నకు హీరోగా హ్యాట్రిక్ హిట్ మూవీ. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు కొంత పుటేజ్ లీకైంది. అందులో ఓ లిప్‌లాక్ సీన్ ఉంది.
 
అర్జున్ రెడ్డిలో లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయిన విజ‌య్ దేవ‌ర‌.. ఈ సినిమాలో కూడా లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయాడు. ఇది యూత్‌కి క‌నెక్టింగ్ పాయింట్ అయింది. అయితే తీరా క్లైమాక్స్‌లో ఆ స‌న్నివేశాన్ని ఎడిటింగ్‌లో లేపేశారు. ఇది యూత్ ఫ్యాన్స్‌కి కాస్త నిరాశ‌ను క‌లిగింది.
 
అంతా మోసం తూచ్ అనుకుంటూ థియేట‌ర్స్ నుండి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునే సినిమా క‌దా! లిప్‌లాక్ సీన్స్ ఎందుకులే అనుకున్నారేమో కాబోలు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆ సీన్స్‌ను ఎడిట్ చేసేశారు…ఏం చేద్దాం!