హీరో ష‌ష్ఠి పూర్తి.. విదేశాల్లో చిలౌట్ పార్టీ

స్పెయిన్ లో హీరో ష‌ష్ఠిపూర్తి ఎందుకు?

అక్కినేని హీరో నాగార్జున వ‌య‌సెంత‌? ఇన్నాళ్లు ఎంత‌ దాచేసినా షష్ఠిపూర్తికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో నాగార్జున‌నే స్వ‌యంగా వ‌య‌సు మ్యాట‌ర్ ఓపెన్ అయిపోతున్నారు. 30 వ‌య‌సు (రెట్టింపు అని అర్థం చేసుకోవాలి) అంటూ `మ‌న్మ‌ధుడు 2` ప్ర‌మోష‌న్స్ లో న‌వ్వేస్తూ రివీల్ చేసిన‌ నాగార్జున ఈ ఆగ‌స్టు 29న స్పెష‌ల్ పార్టీ కోసం రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. ఆరోజు స్పెయిన్ లో నాగార్జున బ‌ర్త్ డేకి ఏర్పాట్లు సాగుతున్నాయి.

నాన్న‌గారి 60వ బ‌ర్త్ డే ప్ర‌త్యేక జ్ఞాప‌కంగా నిల‌వాల‌ని కుమారులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ భావిస్తున్నారు. అందుకే స్పెయిన్ లో కింగ్ కి ఎంతో ఇష్ట‌మైన ఇబిజ అనే బ్యూటిఫుల్ లొకేష‌న్ లో బ‌ర్త్ డే వేడుక‌ను ప్లాన్ చేశార‌ట‌. ఈ వేడుక‌లో నాగార్జున కుటుంబ స‌భ్యుల‌తో పాటు చిన్న‌నాటి స్నేహితులు, బంధుమిత్రులు కుటుంబ స‌భ్యులంతా హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. స్పెయిన్ లో బ‌ర్త్ డే పేరుతో అక్కినేని ఫ్యామిలీ ఫుల్ చిలౌట్ పార్టీని ప్లాన్ చేశారు. కొద్దిరోజుల పాటు అక్క‌డే ఉండి ఫుల్లుగా ఎంజాయ్ చేసి వ‌స్తార‌ట‌. నాగార్జున న‌టించిన మ‌న్మ‌ధుడు 2 ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం పోర్చ్ గ‌ల్ లోని అంద‌మైన లొకేష‌న్ల‌ను చుట్టొచ్చారు. ఇప్పుడు బ‌ర్త్ డే పార్టీని స్పెయిన్ లో డిఫ‌రెంటుగా ప్లాన్ చేశార‌న్న‌మాట‌. అయితే ఈ బ‌ర్త్ డే పార్టీనే నాగార్జున షష్ఠిపూర్తి పార్టీ అనుకోవాలా లేక దానిని స‌ప‌రేట్ గా ఇంకెక్క‌డైనా ప్లాన్ చేస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.