బిగ్ బాస్ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన మహేష్ బాబు (వీడియో)

సూపర్ స్టార్ మహేష్ బాబు సోమవారం బిగ్ బాస్ యాంథం అఫీషియల్ వీడియో రిలీజ్ చేశారు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా “నన్ను దోచుకుందువటే”. ఈ సినిమా సెప్టెంబర్ 13 న రిలీజ్ కు సిద్ధమవుతోంది.

నభ నటేష్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. నాజర్, తులసి, వైవా గణేష్, వేణు మాధవ్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా గురువారం సాయంత్రం 5.01 గం.లకు హీరో మహేష్ బాబు బిగ్ బాస్ యాంథం అఫీషియల్ వీడియో రిలీజ్ చేశారు.

వీడియో సాంగ్ రిలీజ్ చేసినందుకు సంతోషంగా ఉందన్న మహేష్ “నన్ను దోచుకుందువటే” టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. కింద ఉన్న వీడియోలో బిగ్ బాస్ యాంథం మీరు కూడా చూడవచ్చు.

Nannu Dochukunduvate - Big Boss Anthem Video (Telugu) | Sudheer Babu | B. Ajaneesh Loknath, RS Naidu