పిల్లా నువ్వు లేని జీవితం, లవర్ చిత్రాల నిర్మాత హర్షిత్ రెడ్డి వివాహం రేపు అనగా 21 తేదీన గోవాలో తెల్లవారుఝామున 3 గంటలకు వివాహం జరగనుంది. హర్షిత్ మరెవరో కాదు..సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుని కుమారుడే. ఆయన వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు గౌతమి. ఆమె ఆదోని వైసీపీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి కుమార్తె.
ఇదొక డెస్టినేషన్ మ్యారేజ్. ఇండస్ట్రీ నుంచి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి. ఈ పెళ్లికి టాలీవుడ్ కి చెందిన కొంతమంది దర్శక నిర్మాతలతో పాటు హీరోలకి కూడా ఆహ్వానం అందిందని తెలుస్తోంది.
దిల్ రాజు తో పనిచేసిన దర్శకులు, హీరోలు ఈ వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు. వివాహం అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 23న హైదరాబాద్ లో వివాహ విందు ఏర్పాటు చేయబోతుంది దిల్ రాజు ఫ్యామిలీ.. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం.
ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని , ఈ వివాహానికి వైయస్ ఆర్పీకు చెందిన కొందరు ఎమ్మల్యేలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.హర్షిత్ పెళ్లి సందడితో దిల్ రాజు ఇల్లు బంధువులతో కళకళలాడుతోంది.