‘2.0’ పై హరీష్ శంకర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘2.0’ఈ రోజు (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ…‘శంకర్ సార్‌కి హ్యాట్సాఫ్. ఇంతకు మునుపెన్నడూ చూడనటువంటి ఓ అద్భుతమైన ఫీలింగ్‌ని ‘2.0’ చిత్రం కలుగజేస్తోంది. ఇలాంటి అద్భుతం ఒక్క తలైవా రజినీకాంత్‌తోనే సాధ్యం’ అన్నారు.

ఈ సినిమాపై ప్రముఖ తమిళ సినీ విమర్శకుడు రమేష్‌ బాలా ‘ఇప్పటివరకు ఉన్న బాక్సాఫీస్‌ రికార్డులన్నింటికీ రిప్‌. శంకర్‌ మరోసారి తను విజన్‌ ఉన్న మాస్టర్‌ డైరెక్టర్‌ అని ప్రూవ్‌ చేసుకున్నాడు’ అంటూ ట్వీట్‌చేసి అభిమానులకు ఆనందం కలగచేసారు.

రిలీజ్ కు ముందే రికార్డులను సెట్‌ చేసిన 2.0 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6800 థియేటర్లలో పదివేల స్ర్కీన్లపై ఈ చిత్రాన్ని రిలీజ్‌ అయ్యింది. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా ఈ మూవీ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే పేటీఎమ్‌ ద్వారా 1.25 మిలియన్స్‌ టికెట్స్‌ అమ్ముడుపోయినట్టు సమాచారం.

అలాగే బుక్‌మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు దాకా బుక్ అయినట్లు సమాచారం. ఆన్‌లైన్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారానే ఇన్ని లక్షల టికెట్లు తెగడం ‘2.0 ’తోనే సాధ్యమైంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.