‘ఆర్ ఎక్స్ 100’ అంటూ బూతు సినిమాతో హిట్ కొట్టిన బోల్డ్ డైరెక్టర్ అజయ్ భూపతి, దాదాపు రెండు సంవత్సరాల నుండి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి తెగ కిందామీదా పడుతున్నాడు. షూట్ ప్లాన్ లో సన్నాహాలు చేసుకుంటుండగానే, ఈ సినిమా నుండి ఇద్దరు హీరోలు తప్పుకున్నారు. మాస్ మహారాజా రవితేజతో పాటు నాగచైతన్య కూడా తప్పుకోవడంతో.. ఫైనల్ గా అజేయ్, హీరో శర్వానంద్ తో ముందుకు పోయే ప్రయత్నం చేసుకుంటుండగా.. ఈ సారి కరోనా వచ్చింది. మళ్ళీ సినిమా ఆగింది.
అయితే మనోడు మాత్రం రాసిన సీన్స్ నే రాసుకుంటూ కాలక్షేపం చేశాడు. కాగా తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా బబ్లీ బ్యూటీ హన్సికాను తీసుకోబోతున్నాడట. ఇప్పటికే హన్సికాకి అజయ్ కథ కూడా వివరించాడని.. హన్సిక కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయినా ఇవ్వక ఏం చేస్తుందిలే.. అమ్మడుకు ప్రసుతం కొత్త అవకాశాలు రావడం అనేది ఎప్పుడో పాత పడిపోయింది. దాంతో క్యారెక్టర్ కాస్త రొమాన్స్ ఎక్కువ చేయాల్సి వస్తోంది అన్నా.. ఏ మాత్రం మొహమాటం లేకుండా రొమాన్స్ చేయడానికి ఒప్పేసుకుంది హన్సిక.
అన్నట్టు ఈ సినిమాలో మరో హీరో పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ఆ పాత్ర కోసమే.. అజయ్ ఫామ్ లో ఉన్న మరో హీరో కోసం ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. ఏమైనా “ఆర్ఎక్స్ 100” సినిమాతో భారీ విజయం సాధించినా.. తన రెండో సినిమా కోసం మాత్రం అజేయ్ భూపతి బాగా ఎదురుచూడాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ప్రసుతం కరోనాతో పోరాడుతున్నాడు . ఇటివలే ఈ సినిమా ఎకె ఎంటర్ టైన్మెంట్స్ కాంపౌండ్ లోకి వచ్చి వాలిన బాగోతం తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్ళనున్నారు. అన్నట్టు ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అజయ్ చెప్పుకుంటూ ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.