నటసింహ బాలకృష్ణను టాలీవుడ్ ప్రముఖులు భేటీకి ఆహ్వానించకపోవడం పెద్ద పంచాయతీ అయ్యేటట్టే కనిపిస్తోంది. చిరంజీవి, నాగార్జున సహా పరిశ్రమకు చెందిన పలువురు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసానితో భేటి అనంతరం పరిశ్రమలో బాలయ్యపై రాజకీయాలు జరుగుతున్నాయా? అన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిరంజీవి-నాగార్జున మంచి స్నేహితులు, బిజినెస్ మెన్ లు. ఇద్దరు భాగస్వామ్యంలో చాలా వ్యాపారాలు రన్నింగ్ లో ఉన్నాయి. అప్పట్లో మాటీవి అమ్మకాల ద్వారా భారీగానే లాభాలొచ్చాయి. దీంతో ఇరువురు ఒకే వ్యాపారంలో కలిసి పెట్టుబడులు పెట్టడం మరింత పెరిగిందని ఓ రూమర్ ఉంది. వ్యక్తిగతంగాను ఆ రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ కూడా ఉంది. అఖిల్ రామ్ చరణ్ ని అన్నయ్య అని పిలవడం…చరణ్ తమ్ముడు గా సంబోధించడం వంటి వ్యాఖ్యలు ఆ ఫ్యామిలీ మధ్య బాండింగ్ ఎంత స్ర్టాంగ్ అన్నది స్పష్టం చేస్తుంది.
ఇక పరిశ్రమ సహా ప్రజల్లో మెగాస్టార్ కున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకరత్న దాసరి నారాయణరావు తర్వాత పరిశ్రమ పెద్దగా మెగాస్టార్ కీర్తింపబడుతున్నారు. ఏనాడు చిరంజీవి దాన్ని బయటపెట్టకపోయినా 24 శాఖలు మెగాస్టార్ నే పెద్దగా భావిస్తున్నాయి. ఇక బాలయ్యకు చిరంజీవికి పెద్దగా పొసగదు. ఓసారి ఇరువురు మాటలు విసురుకున్న సందర్భాలున్నాయి. ఇద్దరి హీరోల అభమానుల మధ్య వైరం ఎన్నోసార్లు తారా స్థాయికి వెళ్లింది. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి ప్రెండ్ షిప్ అయితే లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీతోనూ బాలయ్యకు సరైన బాండింగ్ లేదు. ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలైన ఎందుకనో బాలయ్యకు-నాగార్జునకు మొదటి నుంచి సెట్ కాలేదు. బాలయ్య అన్నయ్య హరికృష్ణతో కింగ్ కి మంచి దోస్తానం ఉండేది. కానీ ఆ ప్రెండ్ షిప్ బాలయ్యతో లేదు. ఏఎన్నార్ స్వర్గస్తులైనప్పుడు పరిశ్రమంతా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వచ్చినా.. బాలయ్య మాత్రం రాలేదు.
అప్పుడే ఆ రెండు ఫ్యామిలీల మధ్య చెప్పుకోలేని వివాదాలేవో ఉన్నాయని గుసగసులు వినిపించాయి. ఇక బాలయ్య మిగతా హీరోలతో గానీ, డైరెక్టర్లతో గానీ ఎవరితోనూ చనువుగా మెలగరు. ఆయనో డిక్టేటర్ లా ఫీలవుతారని ఆయనే ఓసారి అన్నారు. అందుకే నిర్మాతలు బాలయ్య ముందుంటే తలలు దించుకుని ఉంటారు. అలా రకరకాలు కారణాలుగా బాలయ్య పరిశ్రమకి అంతగా టచ్ లో ఉండరు. మరి వీటన్నింటి కారణంగా బాలయ్యపై పరిశ్రమలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి? అన్న వాదన తాజాగా తెరపైకి వచ్చింది. బాలయ్య తనని ఏ భేటీకి పిలవలేదని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాత సి. కళ్యాణ్ ఆ భేటీలన్నింటి గురించి స్వయంగా తానే బాలయ్య వద్దకు వెళ్లి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెప్పేవాడినని తాజాగా మీడియాకు వెల్లడించారు. మరి ఇందులో ఏది నిజం? ఎవరు నిజం అన్నది తెలియాల్సి ఉంది.