ఘంటసాలను కూడా వదలటం లేదు…కానివ్వండి

(సూర్యం)

ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ లలో  బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. మహానటి విజయంతో అందరి దృష్టీ బయోపిక్ లపై పడింది. ఇప్పటికే నందమూరి తారక రామారావు బయోపిక్ ..ఎన్టీఆర్ మొదలై…శరవేగంగా జరుగుతోంది. మరో ప్రక్క వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర..కూడా రెడీ అవుతోంది. మరో ప్రక్క తమిళనాట అమ్మ బయోపిక్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ అమర గాయకుడు ఘంటసాల బయోపిక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కొందరికి రావటం ,వెంటనే కార్యరూపం దాల్చటం జరిగింది. 

అందుతున్న సమాచారం మేరకు ఘంటసాల జీవితంపై రిసెర్చ్ చేసిన సిహెచ్ రామారావు ఈ బ‌యోపిక్ కు ద‌ర్శ‌క‌త్వ వ‌హించ‌నున్నాడు. యువ గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో న‌టించ‌నున్నాడు..ఆయన భార్య…మృదుల ఘంటసాల సతీమణిగా కనిపించనుంది. లక్ష్మీ నీరజ ఈ చిత్రానికి నిర్మాత‌.. వాసురావు సంగీతం స‌మ‌కూర్చ‌నున్నాడు.. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఈ బయోపిక్ లోనూ ఎన్టీఆర్, ఏ ఎన్నార్ వంటి దిగ్గజాల పాత్రలు ఉంటాయి. ఆ రోజుల నాటి వాతావరణం ఉంటుంది. సినీ పరిశ్రమలోకి రాకముందు ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళటం వంటి అంశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయన జీవిత చరమాంకంలో పాడిన భగవద్గీత  గురించి ఉంటుంది.